EPAPER

Puri Ratna Bhandar Reopen: పూరీ రత్నభాండాగారాన్ని తెరిచిన ప్రభుత్వం.. అందులో ఏమున్నాయంటే..?

Puri Ratna Bhandar Reopen: పూరీ రత్నభాండాగారాన్ని తెరిచిన ప్రభుత్వం.. అందులో ఏమున్నాయంటే..?

Puri Ratna Bhandar Reopens after 46 Years: 46 ఏళ్ల తర్వాత పూరీ రత్న భాండాగారాన్ని తెరిచింది ఒడిశా ప్రభుత్వం. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్నభాండాగారం రహస్య గదిని తెరచినట్లు ఒడిశా సీఎంఓ వెల్లడించింది. మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచినట్లు పేర్కొంది. మొత్తం 11 మంది మాత్రమే గదిలోపలికి వెళ్లారు. వారిలో.. కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సీబీకే మహంతి, ఆలయ పాలన అధికారి అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజినీర్ ఎన్ సీ పాల్, పూరీ రాజప్రతినిధి సహా మరో ఐదుగురు ఆలయ సేవాయత్ లు ఉన్నారు.


కాగా.. పూరీ రత్నభాండాగారం లోపల విషసర్పాలు ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా రత్నభాండాగారంపై ఆసక్తి నెలకొంది. విషసర్పాలు ఉంటే వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ ను సిద్ధంగా ఉంచారు. ఒకవేళ కాటు వేస్తే.. వెంటనే వైద్యం చేసేందుకు వైద్యుల్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఆలయం పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రత్న భాండాగారంలో కళ్లు చెదిరే నగలు, వజ్రాలు, రత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రత్నభాండాగారాన్ని తెరవనున్న నేపథ్యంలో.. ఉదయం శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరంలో జగన్నాథుడి అనుమతి తీసుకుని.. లోకనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆజ్ఞమాల తీసుకుని.. ఖజానా గదికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిథిలో పూజలు నిర్వహించారు.


Also Read: టెన్షన్ టెన్షన్.. తెరిచేదెలా? పూరి నిధి చుట్టూ బుసలుకొడుతున్న నాగులు

రత్నభాండాగారాన్ని తెరవనున్న నేపథ్యంలో.. ఉదయం శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరంలో జగన్నాథుడి అనుమతి తీసుకుని.. లోకనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆజ్ఞమాల తీసుకుని.. ఖజానా గదికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిథిలో పూజలు నిర్వహించారు. అయితే సంపదను లెక్కించేందుకు ఎన్నిరోజులు పడుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం పూరీలో జగన్నాథుని రథయాత్ర జరుగుతోంది. రథయాత్ర రోజునే రత్నభాండాగారాన్ని తెరవడంతో.. అందరి దృష్టి ఆ సంపద పైనే ఉంది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×