EPAPER

Pune IAS trainee controversy: నో కాంప్రమైజ్, చిక్కుల్లో ట్రైన్డ్ ఐఏఎస్.. వీఐపీ సదుపాయాల కోసం..

Pune IAS trainee controversy: నో కాంప్రమైజ్, చిక్కుల్లో ట్రైన్డ్ ఐఏఎస్.. వీఐపీ సదుపాయాల కోసం..

Pune IAS trainee controversy: యూపీఎస్సీకి సెలక్ట్ కావాలని చాలామంది కలలు కంటారు. ఏళ్ల తరబడి చదివినా కొందరికి మాత్రమే దాన్ని అందుకుంటారు. ఐఏఎస్‌గా సెలక్ట్ అయిన ఓ అధికారి, ట్రైనింగ్‌లో ఉండగానే తన కోర్కెల చిట్టాను బయటపెట్టింది. ఇంతకీ ఆమె డిమాండ్లు ఏంటో తెలుసా?


మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పూజా‌ ఖేద్కర్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. పూణెలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో బదిలీ అయ్యారు. ఇప్పుడు మరోసారి వివాదానికి కేంద్రంగా మారారు. తనకు వీఐపీ మాదిరిగా ప్రత్యేక సదుపాయా లు కల్పించాలన్నది ఆమె ప్రధాన డిమాండ్.

పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు డాక్టర్ పూజాఖేద్కర్. ఉన్నతాధికారుల పర్మీషన్ తీసుకోకుండానే ప్రైవేటు ఆడి కారు, రెడ్ అండ్ బ్లూ బీకన్ లైట్లు, అంతేకాకుండా తన కారుకి వీఐపీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికితోడు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలం బయటకు వచ్చినప్పుడు మాత్రమే.


ALSO READ: జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్.. సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే తొలిసారి!

ఈ కలెక్టరమ్మ ప్రత్యేక సదుపాయాలు కావాలని డిమాండ్ చేశారు. వసతితోపాటు తగినంత సిబ్బంది, పోలీసు కానిస్టేబుల్‌తో ఓ అధికారిక ఛాంబర్ కావాలన్నది ముఖ్యమైనవి. అదనపు కలెక్టర్ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్‌లో తన నేమ్ ప్లేట్ పెట్టుకుని ఛాంబర్‌గా వినియోగిస్తున్నారు. తన పేరు మీద లెటర్ హెచ్, విజిటింగ్ కార్డు, పేపర్ వెయిట్, నేమ్ ప్లేట్, రాజముద్ర వంటివి అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు.

విచిత్రం ఏంటంటే.. పూజా ఫాదర్ సైతం రిటైర్ ఐఏఎస్ అధికారి. ఆయన కూడా తన కూతురు వత్తాసు పలికారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రైనీలో ఉన్న అధికారులకు వీఐపీ తరహా సదుపాయాలు ఉండవు. ఈమె వ్యవహారాన్ని పూణె కలెక్టర్.. చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో మరో చోటకు ట్రాన్స్‌ఫర్ చేశారు.

2023 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ పూజాఖేద్కర్, యూపీఎస్సీలో 841 ర్యాంక్ సాధించారు. ఓబీసీ కోటాలో ఈమె ఐఏఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యారు. అయితే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగంలో చేరే సమయంలో మెడికల్ టెస్టులకు హాజరుకాలేదని ఆరోపిస్తున్నారు. మరి ఈ సమస్యలు దాటుకుని ఆమె ఎలా ఐఏఎస్ అయ్యారన్నది అసలు ప్రశ్న.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×