EPAPER

Pashupati Kumar Paras: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

Pashupati Kumar Paras: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!
Pashupati Kumar Paras
Pashupati Kumar Paras

Pashupati Kumar Paras: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో బిగ్ షాక్ తగిలింది. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పశుపతి కుమార్ పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఆయితే ఆయన రాజీనామాతో ఖాళీగా మారిన కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలను.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఆప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి పరాస్.. త్వరలోనే విపక్ష ఆర్జేడీ కూటమిలో చేరనున్నట్లు సమాచారం.


లోక్ సభ ఎన్నికల వేళ బిహార్ లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్డీయే కూటమి నుంచి ఓదొలుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తూ.. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అధనంగా అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన పశుపతి పరాస్ త్వరలోనే ఆర్జేడీ కూటమిలో చేరి హాజీపూర్ నుంచి చిరాగ్ పై పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Supreme Court: ఎన్నికల ముందు ఉచిత హామీలపై పిల్.. విచారణకు సుప్రీం రెడీ..


పొత్తులో భాగంగా బిహార్ లో ఎన్డీయే కూటమి చిరాగా పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీకి 5 సీట్లు కేటాయించింది. దీనిపై పశుపతి ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. బీహార్ లో తమకు 5 ఎంపీ సీట్లు ఉన్నాసరే పొత్తులో భాగంగా తమకు బీజేపీ ఒక్కసీటు ఇవ్వకుండా పక్కన పెట్టిందని.. దాని కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఓ గొప్ప నేత అని తాను ఎప్పుడూ.. మోదీకి రుణపడి ఉంటానన్నారు. అయితే ప్రస్తుతం పశుపతి పరాస్ ఎన్డీయే కూటమినుంచి బయటకు రావడంతో.. ఆయన బిహార్ ప్రతిపక్ష కూటమి అయిన ఆర్జేడీలో చేరాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నామని ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×