EPAPER

Union Budget : బడ్జెట్ ఎలా తయారవుతుంది?

Union Budget : బడ్జెట్ ఎలా తయారవుతుంది?
Union Budget

Union Budget : ఏటా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుందని మనకు తెలుసు. అయితే.. దీని తయారీ వెనక పెద్ద ప్రక్రియే సాగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సుమారు 6 నెలల కసరత్తు చేస్తే గానీ మనం వినే బడ్జెట్ రెడీకాదు. ప్రభుత్వపు ఆదాయ వ్యయాలు, వచ్చే ఆర్థిక సంత్సరపు ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలు, కార్యక్రమాల ఆదాయ వ్యయాలు.. ఇలా బోలెడన్ని అంశాలు ఇందులో పొందుపరుస్తారు. మరో వారం రోజుల్లో కొత్త బడ్జెట్ రానున్న ఈ సమయంలో .. బడ్జెట్ తయారీ క్రతువు ఎలా సాగుతుందో తెలుసుకుందాం.


బడ్జెట్ అంటే..?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం.. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ వార్షిక ఆర్థిక ఆడిట్. ఒక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చుల అంచనా ప్రకటన. ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి దాని అంచనా ఆదాయాలు, ఖర్చుల వివరాలను అందజేస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. బడ్జెట్ తయారీ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రపతి ఆమోదం వరకు జరిగే ప్రక్రియ ఇక్కడ తెలుసుకుందాం.

180 రోజుల కష్టం
బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగంగా మొదట అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వతంత్ర సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది. ఈ సర్క్యూలర్స్‌లో అవసరమైన మార్గదర్శకాలు ఉంటాయి. వీటి ద్వారానే అవసరాలు, డిమాండ్లను తెలిపేందుకు అవకాశం ఇస్తుంది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయ్యే ఆదాయ వ్యయాలు సహా గత సంవత్సరానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖలు అందిస్తాయి. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి మంత్రిత్వ శాఖలు, వ్యయాల విభాగంతో చర్చలు చేపడతారు.


నిధుల మంజూరు
అందిన సమాచారం ధ్రువీకరించిన తర్వాతా.. రాబోయే ఖర్చులకు సంబంధించిన ఆదాయాన్ని వివిధ విభాగాలకు కేటాయిస్తుంది ఆర్థిక శాఖ. ఒకవేళ ఈ కేటాయింపులకు సంబంధించి అభ్యంతరాలు వస్తే కేంద్ర మంత్రివర్గం, ప్రధాన మంత్రితో చర్చిస్తుంది. మరోవైపు.. వ్యవసాయ నిపుణులు, చిన్న తరహా పరిశ్రమల ప్రొప్రైటర్స్, విదేశీ సంస్థాగత మదురులతోనూ ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చలు చేపడుతుంది.

సమాచార తనిఖీ
వివిధ భాగస్వామ్య విభాగాలతో ఆర్థిక శాఖ ప్రీబడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వారి సూచనలు, అవసరాలపై చర్చిస్తుంటుంది. ఇందులో రాష్ట్రాల ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, బ్యాంకర్లు, ఆర్థిక, వాణిజ్య యూనియన్ల ప్రతినిధులు ఉంటారు. వారందరినీ సూచనలు తీసుకుని ధ్రువీకరణ కోసం ప్రధానితో చర్చిస్తుంది ఆర్థిక శాఖ. తర్వాత ఆర్థిక శాఖ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ బోడర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమర్స్‌తో సమావేశమౌతుంది. ఎంత రెవెన్యూ వస్తుందో నివేదిక కోరుతుంది. వీటి ద్వారా బడ్జెట్ తయారు చేస్తుంది.

బడ్జెట్ రెడీ
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజుల ముందు సంప్రదాయంగా కొనసాగుతున్న హల్వా ఉత్సవాన్ని నిర్వహిస్తుంది ఆర్థిక శాఖ. ఈ హల్వా కార్యక్రమంతోనే బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ మొదలవుతుంది. హల్వా తయారు చేసేందుకు పెద్ద కడాయిని ఉపయోగిస్తారు. బడ్జెట్ తయారీ తర్వాత గతంలో దీనిని ప్రింటింగ్ కోసం ఆర్థిక శాఖ సిబ్బందికి దీనిని అందించేవారు. ఆ ప్రింట్ పని పూర్తయ్యేవరకు వారంతా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పనిచేసేవారు. ప్రస్తుతం కొత్త పార్లమెంటులో సాంకేతికత కారణంగా బడ్జెట్‌ను డిజిటల్ ఫార్మెట్లో అందిస్తున్నా.. బడ్జెట్ కీలక బృందం చివరివరకు అజ్ఞాతంలోనే ఉంటుంది.

బడ్జెట్ ఆవిష్కరణ
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్ తయారీకి చివరి దశ. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగం చేస్తారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఆ తరువాత బడ్జెట్‌ను రెండు సభల ముందు ఉంచుతారు. ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×