EPAPER

Prakash Ambedkar: షరద్ పవార్ సిఎంగా ఉన్నప్పుడే మాఫియా డాన్‌తో దుబాయ్‌లో కలిశేవారు: అంబేడ్కర్ మనవడు

Prakash Ambedkar: షరద్ పవార్ సిఎంగా ఉన్నప్పుడే మాఫియా డాన్‌తో దుబాయ్‌లో కలిశేవారు: అంబేడ్కర్ మనవడు

Prakash Ambedkar| భారతదేశ రాజ్యాంగ రూపకర్త బి.ఆర్. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌సీపీ) అధ్యక్షుడు షరద్ పవార్ పై సంచలన ఆరోపణలు చేశారు. షరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో దుబాయ్ లో కలిశారని.. అతడి నుంచి బంగారు చైన్ బహుమానంగా స్వీకరించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అయితే ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలా నేరస్తుడితో రహస్య మీటిండ్ చేసేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే విషయంపై షరద్ పవార్, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాడీ అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశ్ అంబేడ్కర్ మరి కొన్ని రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ఈ ఆరోపణలు చేయడం.. సంచలనంగా మారింది. ఎన్‌సీపీ అధ్యక్షుడు షరద్ పవార్ 1988 నుంచి 1991 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఈ కాలంలోనే షరద్ పవార్ విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ముందుగా అమెరికాలోని క్యాలిఫోర్నియా వెళ్లి ఆ తరువాత లండన్ వెళ్లారు.

Also Read: నిషేధం ఉన్నా గర్భగుడిలో ప్రవేశించిన సిఎం కుమారుడు.. మండిపడిన ప్రతిపక్షాలు


అయితే షరద్ పవార్ ఈ పర్యటన మధ్యలో దుబాయ్ కు కుడా వెళ్లారని.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో అరగంటపాటు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో మీటింగ్ చేశారని ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపణలు చేశారు. దుబాయ్ లో రహస్య మీటింగ్ తరువాత షరద్ పవార్ తిరిగి లండన్ వెళ్లిపోయారని.. అయితే వెళ్లే ముందు ఆయనకు దావూద్ ఇబ్రహీం ఒక బంగారు గొలుసు బహుమానంగా ఇచ్చారని చెప్పారు.

ముంబై నగరంలో 1991లో బాంబు పేలుళ్ల ఘటన జరగడంతో దేశ రాజకీయాలు అప్పుడు సీరియస్ గా మారాయి. ఈ బాంబు పేలుళ్ల వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే దావూద్ ఇబ్రహీం దేశం వదిలి దుబాయ్, పాకిస్తాన్ లకు మకాం మార్చాడు.

Also Read: RSS Workers Injured: మిడ్‌నైట్ హంగామా.. 10 మందిపై కత్తులతో దాడి.. రాత్రి ఏం జరిగిందంటే..

ఈ విషయాలను ప్రకాశ్ అంబేడ్కర్ ప్రస్తావిస్తూ.. తాజాగా ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖి ముంబైలో హత్యకు గురికావడం, షరద్ పవార్ 1990 దశకంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో మీటింగ్ చేయడం.. ఈ విషయాలు ఓటర్లు గుర్తుపెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేయాలని సూచించారు. షరద్ పవార్ దుబాయ్ లో దావూద్ ఇబ్రహీం లాంటి నేరస్తుడితో కలవడానికి అప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే విషయంపై పవార్, కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపణలను ఎన్‌సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో తిప్పికొట్టారు. ప్రకాశ్ అంబేడ్కర్ రాజకీయంగా లబ్ది పొందడానికే ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా ఓటర్లను మభ్యపెట్టడానికి బిజేపీ ఆదేశాలతో ఆయన ఆడుతున్న డ్రామా అని చెప్పారు.

Related News

Ratapani Wildlife Sanctuary: 7 పులులు, 14 చిరుత పులులు, 1 ఎలుగుబంటి మృతి.. ‘అంతా రైల్వే శాఖ తప్పిదమే’

RSS Workers Injured: మిడ్‌నైట్ హంగామా.. 10 మందిపై కత్తులతో దాడి.. రాత్రి ఏం జరిగిందంటే..

Eknath Shinde son: నిషేధం ఉన్నా గర్భగుడిలో ప్రవేశించిన సిఎం కుమారుడు.. మండిపడిన ప్రతిపక్షాలు

Tamil Nadu Governor: ‘జాతీయ సమైక్యతను అవమానించారు.. గవర్నర్‌ను రీకాల్ చేయండి’.. కేంద్రాన్ని కోరిన సిఎం

Isha Foundation : సద్గురుకి సుప్రీం బిగ్ రిలీఫ్‌, మద్రాసు హైకోర్టులో ఇషా ఫౌండేషన్‌పై కేసు కొట్టివేత

Pm Modi : నాలుగు నెలల్లో ఇది రెండోసారి… మళ్లీ రష్యాకు ప్రధాని మోదీ, స్వయంగా ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్

Big Stories

×