EPAPER

Porsche car accident in Pune, Teen admits: యాక్సిడెంట్‌.. మైనర్ నోటి వెంట.. ఆ ఒక్కటీ..

Porsche car accident in Pune, Teen admits: యాక్సిడెంట్‌.. మైనర్ నోటి వెంట.. ఆ ఒక్కటీ..

Porsche car accident in Pune, Teen admits: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది పూణె పోర్షే కారు ఘటన. మైనర్ పేరెంట్స్, రిపోర్టులు మార్చిన డాక్టర్లు అరెస్ట్ చేశారు పోలీసులు. అసలేం జరిగిందనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంపై మైనర్‌పై దృష్టి సారించారు. జువైనల్ బోర్డు పర్యవేక్షణలో ఉన్న టీనేజర్‌ని విచారిస్తున్నారు పోలీసులు.


ప్రమాదం జరిగిన రోజు అసలేం జరిగింది? యాక్సిడెంట్ ఎలా చేశావు అనే ప్రశ్నలు రైజ్ చేశారు పోలీసులు. తాను మద్యం మత్తులో ఉండడంతో ఘటన జరిగిందని, ఆ రోజు ఏమి జరిగిందో తనకు గుర్తు రావడం లేదని చెప్పినట్టు దర్యాప్తు పోలీసులు చెబుతున్నమాట. ప్రమాదానికి ముందు తన ఫ్రెండ్స్‌తో కలిసి రెండు బార్లకు వెళ్లినట్టు పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించారు. గంటన్నరకు 48 వేలు రూపాయలు ఖర్చు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి మరో బార్‌కి వెళ్లి మద్యం తీసుకున్నట్లు పోలీసులు బయటపెట్టారు. ఆ తర్వాతే ప్రమాదం జరిగిందని అంటున్నారు.

అంత ఫుల్‌గా తాగితే అసలు కారును ఎలా మూవ్ చేశాడనేది అసలు ప్రశ్న. ఎందుకంటే మైనర్ తండ్రి బిజినెస్‌మేన్ కావడంతో అసలు విషయాలు బయటకు రాలేదన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ కేసులో మైనర్ ఫ్యామిలీ వ్యవహరించిన తీరుపై ప్రజలు భగ్గుమంటున్నారు. మైనర్ తాత, తండ్రి, తల్లి, ఇద్దరు డాక్టర్లు అరెస్టయ్యారు. ఒక తప్పుకు ఇప్పటివరకు ఐదుగురు బలయ్యారు. పేరెంట్స్‌కు పూణె కోర్టు జూన్ ఐదు వరకు పోలీసు కస్టడీ విధించింది.


ALSO READ:  పోర్షే కారు ప్రమాదంలో ట్విస్ట్.. మైనర్ తల్లి అరెస్ట్

బాలుడు నోరు విప్పితే అసలు గుట్టు బయటపడుతుందని అంటున్నారు పోలీసులు. మే 19న పూణెలో కారు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఫోర్షె కారును వేగంగా నడుపుతూ టూ వీలర్‌ని ఢీకొట్టాడు ఈ మైనర్. ఈ ఘటనలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై బాధితుల ఫ్యామిలీ సభ్యులు తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. 100 మందితో కూడిన దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నాయి.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×