EPAPER

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Himachal Toilet Tax | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ పేరుతో ప్రభుత్వం ప్రజల పన్ను విధించబోతోందని వార్తలు రాగానే ఈ అంశంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చింది. అయితే ఇలాంటి పన్ను తమ ప్రభుత్వం విధించబోవడం లేదని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సుఖు స్పష్టం చేశారు. అంతకుముందు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్స్ లో, సోషల్ మీడియాలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నగరాల్లో, పట్టణాల్లో ప్రజలపై ఇంట్లో అదనంగా టాయిలెట్ ఉంటే ప్రతి టాయిలెట్ సీటుకి రూ.25 పన్ను విధించబోతోందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం వసూలు చేసే నీటి పన్ను రూ.100 లో ఈ టాయిలెట్ ట్యాక్స్ రూ.25 కలిపే ఉంటుందని బాగా ప్రచారం జరిగింది.


అయితే హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇదంతా బిజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అని విమర్శులు చేసింది. ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సుఖు మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజేపీ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నీటి పన్ను తొలగించేస్తామని.. ప్రజలకు ఉచితంగా నీరు అందిస్తామని చెప్పింది. అయితే మేము (కాంగ్రెస్ పార్టీ) నీటి పన్నులో రూ.100 పన్ను మినహాయింపు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చాం. ప్రజలకే కాదు హోటల్స్ , రెస్టారెంట్లకు కూడా ఈ మినహాయింపు ఇస్తున్నాం. అయితే కొంతమంది ధనికులకు ఆ రూ.100 మినహాయింపు ఇవ్వలేదు. అంతే కాని టాయిలెట్ ట్యాక్స్ అనేది అంతా అబద్ధం. పెద్ద పెద్ద 5 స్టార్ హెటల్స్‌కు కూడా నీటి పన్నులో ఈ రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇదంతా కావాలనే ప్రతిపక్ష బిజేపీ ప్రచారం చేస్తోంది. వాళ్లు ముందు ఎకనామిక్స్ చదువుకోవాలి ” అని ఎద్దేవా చేశారు.

Also Read:  ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..


అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టాయిలెట్ ట్యాక్స్ ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ”నేను విన్నదే నిజమైతే, ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఒకవైపు ప్రధాన మంత్రి మోదీజీ ప్రజల కోసం స్వచ్ఛ భారత్ అని శ్రమపడుతుంటే, మరోవైపు ఈ కాంగ్రెస్ ప్రజలకు టాయిలెట్స్ పై పన్ను విధిస్తోంది. ఇది దేశం సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలకు కాంగ్రెస్ పాలనలో సరైన శానిటేషన్ కూడా కాంగ్రెస్ అందడంలేదు.” అని ట్విట్టర్ ఎక్స్ పై ట్వీట్ చేశారు.

బిజేపీ నేషనల్ జెనెరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ కూడా కాంగ్రెస్ పార్టీని, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శించారు. ”ప్రజలపై ఎడతెరపిలేకుండా కొత్త పన్నులు, ఆంక్షలు విధిస్తూ కాంగ్రెస్ పార్టీ వేధిస్తోంది. దీని బట్టి అర్థమవుతోంది.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసిందని. ఆర్థికంగానే కాదు, మానసికంగా, వారి పరిపాలన కూడా దివాలా తీసింది.” అని ట్విట్టర్ లో రాశారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో నిజమేంటని ఆరా తీస్తే.. సెప్టెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని 5 స్టార్ హోటల్స్ పై ఈ రూ.25 టాయిలెట్ ట్యాక్స్ పన్ను విధించింది. ఆ హోటల్స్ మునిసిపల్ నీటి కనెక్షన్ ద్వారా నీటిని ఉపయోగించకుండా సొంత వనురుల నీరు ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ హోటల్స్ ప్రభుత్వానికి తగ్గిన ట్యాక్స్ చెల్లించడం లేదు. అందుకే ప్రభుత్వం వారిపై ట్యాక్స్ విధించింది.

ప్రభుత్వ నీరు ఉపయోగించకపోయినా.. హోటల్స్ టాయిలెట్ ని ఉపయోగిస్తున్నాయి. ఆ టాయిలెట్స్ మురుగు నీరంతా మునిసిపల్ శాఖ ద్వారా పరిశుభ్రం చేయాలి. అందుకే కొన్ని హోటల్స్ పై మాత్రం అదనపు టాయిలెట్ ట్యాక్స్ విధిస్తూ హిమాచల్ ప్రదేశ్ జల్ శక్తి శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. కానీ ప్రకటన జారీ చేసిన కొన్ని గంటల్లోనే హిమాచల్ ఉప ముఖ్యమంత్రి ముకేశ్ అగ్నిహోత్రి ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ ట్యాక్స్ గురించి తెలిసిన మన ఏపీ నెటిజన్స్.. ఇది మన చెత్త ట్యాక్స్ కంటే చెత్తగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Chhattisgarh Encounter: మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Big Stories

×