EPAPER
Kirrak Couples Episode 1

Padma: రాజకీయ పద్మాలు!.. కేంద్రం ఖతర్నాక్ మైండ్ గేమ్?

Padma: రాజకీయ పద్మాలు!.. కేంద్రం ఖతర్నాక్ మైండ్ గేమ్?

Padma: ఈసారి ఆరుగురికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇద్దరు రాజకీయ నేతలే కావడం ఆసక్తికరం. యూపీకి చెందిన ములాయంసింగ్ యాదవ్, కర్నాటక నుంచి ఎస్.ఎం కృష్ణకు పద్మవిభూషణ్ ఇవ్వడం పొలిటికల్ గా సంచలనంగా మారింది.


కేంద్రంలో అధికారంలో ఎవరు ఉండాలనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే డిసైడ్ చేస్తుందంటారు. ఏకంగా 80 పార్లమెంట్ స్థానాలతో దేశంలోకే అతిపెద్ద స్టేట్ అది. అందుకే, యూపీలో నెగ్గితే.. ఢిల్లీ దక్కినట్టే. గత ఎన్నికల్లో ఏకంగా 62 స్థానాలను కొల్లగొట్టింది బీజేపీ. హస్తినలో ఈజీగా అధికారంలోకి వచ్చేసింది. ఎలాగైనా యూపీని వదులుకోకూడదనే పట్టుదలతో ఉంది. సీఎం యోగి ఛరిస్మా పని చేస్తున్నా.. యూపీలో బలంగా ఉండే యాదవ వర్గం నాయకుడిగా సమాజ్ వాది పార్టీ (SP) అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ కమలనాథులకు సవాల్ గానే ఉన్నారు. ఇటీవల అఖిలేష్, కేసీఆర్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. అఖిలేష్ కు గులాబీ బాస్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నాయంటూ కమలనాథులు ఆరోపిస్తున్నారు. లేటెస్ట్ గా ఖమ్మం బీఆర్ఎస్ సభకు సైతం అఖిలేష్ యాదవ్ అటెండ్ అయ్యారు.

అలాంటిది, తాజాగా అఖిలేష్ యాదవ్ తండ్రి, ఎస్పీ వ్యవస్థాపకులు దివంగత ములాయంసింగ్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ ఆద్యుడికి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురష్కారం ఇవ్వడం మామూలు విషయం కానేకాదు. యూపీ, బీహార్ లోని యాదవ వర్గమంతా కేంద్రానికి జై కొట్టడం ఖాయం.


తండ్రి ములాయం నుంచి పార్టీని బలవంతంగా లాగేసుకున్నారు అఖిలేష్. ఆ విషయంలో ఆయన బాగా బ్లేమ్ అయ్యారు కూడా. ఇప్పుడు అదే ములాయంకు కేంద్రం పద్మవిభూషణ్ ఇవ్వడం.. యాదవులను అఖిలేష్ నుంచి దూరం చేయడమే అంటున్నారు. తన తండ్రికి పద్మవిభూషణ్ వచ్చిందనే సంతోషం కంటే.. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అవార్డు ఇచ్చిందనే ఆందోళనే అఖిలేష్ కు ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. బీజేపీ కదిపిన పావుకు.. యంగ్ లీడర్ అఖిలేష్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ఉంటుందంటున్నారు.

మరోవైపు, మరో కీలక రాజకీయ నేత ఎస్ఎం కృష్ణకు పద్మవిభూషణ్ రావడంలోనూ రాజకీయ కోణం వెతుకుతున్నారు. ఒకప్పుడు ఆయన ప్రముఖ కాంగ్రెస్ నేత. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా. బెంగళూరును దేశంలోకే నెంబర్ 1 ఐటీ హబ్ గా మార్చిన క్రెడిట్ ఆయనదే. విదేశాల్లో చదువుకొచ్చి.. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్రమంత్రిగా పని చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కొనసాగి.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవలే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అలాంటి ఎస్ఎం కృష్ణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారం రావడం వ్యూహాత్మకమని అంటున్నారు. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కృష్ణకు పద్మ అవార్డు ఇవ్వడం.. కాంగ్రెస్ కేడర్ ను కన్ఫ్యూజన్ లో పడేయడం, వక్కలిగ వర్గాన్ని ఆకర్షించడం, కన్నడిగుల ఆదరణ చూరగొనడం.. ఇలా ఒక్క అవార్డుతో మూడు ప్రయోజనాలు అనే చర్చ నడుస్తోంది.

Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Big Stories

×