EPAPER

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari


PM Modi takes elephant safari in Kaziranga National Park(today news telugu): ప్రధాని మోదీకి సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం మనం ఆయన చేసే పనులు బట్టి తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మోదీ చేసిన పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆ తర్వాత మోదీ సముద్రంలో మునిగిన ద్వారకను సందర్శించి అక్కడ పూజలు చేయడం.. ఇలా రకరకాల సాహసాలు చేస్తూ దేశ ప్రజలను అబ్బురపరుస్తారు. అయితే తాజాగా ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ (Kziranga National park)లో జంగిల్ సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్ పుర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మార్చి 8 సాయంత్రం జాతీయ పార్క్ లో ప్రధాని బస చేశారు. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సంట్రల్ కొహోరా రేంజ్ ను సందర్శించారు. ఆ తర్వాత జీపులో కొంతసేపు, ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఆ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువులను చిత్రాలను కెమరాలో బంధించారు.


Read more: మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే.. దేశ ప్రజలు, అభివృద్ధి కోసం పనిచేస్తా : ప్రధాని మోదీ

మోదీ వెంట పార్క్ డైరక్టర్ సొనాలి ముఖేష్, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. సఫారీ అనంతరం మోదీ ఏనుగులకు చెరుకు గడలను తినిపించారు. ఈ సంధర్బంగా మహిళా ఫారెస్ట్ గార్డ్ లతో ప్రధాని ముచ్చటించారు. కజిరంగా నేషనల్ పార్క్ ను సంధర్శించి , అక్కడ ప్రకృతి దృశ్యాలను, అసమానమైన అందాలను, తప్పకుండా చూడాలని నేను మీ అందరిని కోరుతున్నాను. అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పర్యటనలో భాగంగా అస్సాంలోని జోర్ హట్ లో కమాండర్ లచిత్ బర్ఫూకాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇక 18 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ అస్సాంలో ప్రారంభోత్సవం చేయనున్నారు. శౌర్యానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×