EPAPER
Kirrak Couples Episode 1

Quad Summit: క్వాడ్‌ దేశాల సమావేశం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Quad Summit: క్వాడ్‌ దేశాల సమావేశం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

PM Modi says ‘Quad here to stay’, holds ‘fruitful’ talks with Joe Biden: క్వాడ్ సమ్మిట్.. ఇప్పుడంతా దీని గురించే చర్చ.. మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకే అమెరికా వెళ్లారు. కానీ, కొన్నేళ్ల క్రితం వరకు అస్సలు పట్టించుకోని ఈ క్వాడ్‌కు ఇప్పుడెందుకు ఇంత ఇంపార్టెంట్స్ వచ్చింది? అసలు ఈ సమ్మిట్‌లో ఏం చర్చించారు? ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అసలు ఈ క్వాడ్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం కలగనుంది?


క్యాడిలెటరల్ సెక్యూరిటీ డైలాగ్.. సింపుల్‌గా క్వాడ్‌ .. గత కొన్ని రోజులుగా న్యూస్‌ హెడ్‌లైన్స్‌గా ఎక్కువగా వినిపిస్తోంది ఈ పదం.. నిజానికి 2004లో సునామీ విధ్వంసం తర్వాత 2007లో ఏర్పాటైంది ఈ కూటమి. ఇందులో ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జపాన్‌లు భాగమై ఉన్నాయి. నిజానికి అప్పుడు ఏర్పడింది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సహాయక చర్యలు నిర్వహించడానికి పరస్పరం సహకరించుకునే భాగంలో.. ఇప్పుడు ఇప్పుడు కొనసాగుతోంది మాత్రం డ్రాగన్ కంట్రీ చైనా వల్లే.. అవిను.. చైనా అనేది లేకపోతే.. క్వాడ్ లేదనే చెప్పాలి.

ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే 2007లో ఏర్పాటైనా ఈ కూటమిపై ఎవ్వరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. దశాబ్ధ కాలం తర్వాత అంటే 2017లో మళ్లీ యాక్టివ్ అయ్యింది ఈ క్వాడ్.. ఎందుకూ అంటే.. చైనా.. రోజురోజుకు బలపడుతుండటం.. విస్తరణపై ఫోకస్ చేయడం. సరిహద్దులను మార్చేయడం.. ప్రతీ దేశంతో తగువులు పెట్టుకోవడం.. ఇవన్నీ క్వాడ్‌ను మరింత దగ్గరగా వచ్చేలా చేశాయి. పేరుకు 2017లో యాక్టివ్ అయినా.. ఫస్ట్‌ క్వాడ్ సమ్మిట్ నిర్వహించడానికి 2021 వరకు ఆగాల్సి వచ్చింది. సరే ఇదంతా పాస్ట్.. ప్రజెంట్‌ కూడా కాస్త అటు ఇటుగానే ఉంది పరిస్థితి.. ఫ్రీ అండ్ ఓపెన్‌ ఇండో-పసిఫిక్‌ రీజియన్ అనే కాన్సెప్ట్‌తోనే ఈసారి కూడా ఏజెండాను ఫిక్స్ చేశారు. దానిపైనే చర్చించారు. చైనా పేరు ఎత్తకుండా చైనా గురించే డిస్కస్ చేశారు. సౌత్ చైనా సీలో మిలటరీ ప్రసెన్స్ పెరుగుతుందని.. ఇది ఆ ఏరియాలోని దేశాల అభివృద్ధికి ఇది ఆటంకం అంటూ ఖండించాయి క్వాడ్ దేశాలు. అంతేకాదు ఇండో పసిఫిక్‌ ఏరియాలోని సముద్రంపై నిఘానే టార్గెట్‌గా క్వాట్ ఏటీసీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.. అంతేకాదు కంబైన్డ్ ఎక్సర్‌సైజ్‌లు, ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.


క్వాడ్‌ను కలిపి ఉంచేది భయమే అని చెప్పాలి.. చైనా భయం లేకపోతే ఇప్పటికెప్పుడో క్వాడ్‌ను చుట్టేసి అటకెక్కించేవారు ఈ నాలుగుదేశాధిపతులు.. నిజానికి ఈ క్వాడ్‌పై అమెరికా అంతగా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం. ఆ దేశానికి చాలా అనుకూలమైన అంశాలు ఉండటం.. ఇప్పటి వరకు అమెరికా అలయెన్సెస్‌ అన్ని వెస్ట్రన్ కంట్రీస్‌తోనే ఉన్నాయి. క్వాడ్‌లో ఇండియా ఉండటం ఆ దేశానికి చాలా అనుకూలించే అంశం. ప్రపంచం మొత్తంపై కంట్రోల్ ఉండాలంటే వెస్ట్, ఈస్ట్‌పై పట్టు సాధించాలి. ఇప్పటికే వెస్ట్‌పై అమెరికాకు మంచి సంబంధాలు పట్టు ఉన్నాయి. కానీ.. ఈస్ట్‌ వైపే పరిస్థితి అంత అనుకూలంగా లేదు అమెరికాకు.. ఎందుకంటే చైనా, రష్యా… ఈ రెండు దేశాలు ఈస్ట్‌వైపే ఉన్నాయి. ఈ రెండు దేశాలే అమెరికా పెత్తనాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే భారత్ లాంటి దేశం అవసరం అమెరికాకు చాలా ఉంది. అందుకే క్వాడ్‌కు చాలా ఇంపార్టెంట్స్ ఇస్తుంది అమెరికా..

Also Read: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీం కీలక తీర్పు.. చూసినా, డౌన్ లోడ్ చేసినా నేరమే

అయితే ఇందులో మనకు ఎలాంటి లాభం లేదా? అంటే ఉందనే చెప్పాలి. చైనా సెంట్రిక్‌గానే క్వాడ్ సమ్మిట్‌ జరుగుతుండటం మనకు చాలా లాభాన్ని ఇస్తుంది. ఇప్పటికే మనకు చైనాతో బార్డర్ పంచాయితీ ఉంది. ఒకవేళ ఏదైనా ఉద్రిక్తత నెలకొంటే.. క్వాడ్‌లోని దేశాలు మనకు సపోర్ట్‌గా వచ్చే అవకాశాలు ఉంది. అంతేకాదు.. ఇండో పసిఫిక్ ఏరియాలో మనం మన ఉనికిని పెంచుకోవచ్చు.. ప్లస్.. క్వాడ్‌లోని దేశాలు చాలా అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు.. మోడీ పర్యటనలో కుదిరిన డీల్స్.

ఈ టూర్‌లో అమెరికా నుంచి 31 MQ-9B డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరింది. ఇందులో 16 స్కై గార్డియన్.. 15 సీ గార్డియన్ డ్రోన్స్ ఉన్నాయి. ఈ డీల్ విలువ అక్షరాలా 3 బిలియన్ డాలర్లు.. ఇవే కాకుండా భారీ పరికరాలు, జెట్ ఇంజెన్స్, అమ్యూనేషన్స్, గ్రౌండ్ మొబిలిటి సిస్టమ్స్‌ను తయారు చేయడం.. ఇలా అనేక ఒప్పందాలు కుదిరాయి. ఇది మన డిఫెన్స్‌ రంగానికి ఎంతో మేలు చేసేవే.. కాబట్టి.. ఇక్కడ ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరి లాభాలు ఉన్నాయి వారికున్నాయి. అయితే చైనాను వెస్ట్రన్ కంట్రీస్ శత్రువుగా చూసినన్ని రోజులు ఈ కూటమి మధ్య బంధం పెరుగుతుందే తప్ప.. తగ్గదు..

Related News

Arrow Shot: దారుణం.. మహిళా ఎస్సై తలలోకి బాణాన్ని దించిన దుండగులు

Iron Rods on Trailway Track: ఓరి మీ దుంపల్ తెగ.. ఇవేం పనులు రా.. పంజాబ్ లో రైలు పట్టాలపై రాడ్లు

Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీం కీలక తీర్పు.. చూసినా, డౌన్ లోడ్ చేసినా నేరమే

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Ajmer Clashes: ఆజ్మీర్‌లో స్ట్రీట్ ఫైటింగ్.. రెండు వర్గాలు మధ్య రోడ్డుపై

Software Engineer: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?

Big Stories

×