EPAPER

PM Modi Reveals Key Points: మోదీ ఇంటర్వ్యూ.. బెంగాల్‌లో భారీగా.. ఒడిషాలో మాదే పైచేయి.. కాకపోతే..!

PM Modi Reveals Key Points: మోదీ ఇంటర్వ్యూ.. బెంగాల్‌లో భారీగా.. ఒడిషాలో మాదే పైచేయి.. కాకపోతే..!

PM Modi Reveals BJP Performance in Bengal and Odisha: దేశంలో సార్వత్రిక ఎన్నికలు దాదాపు క్లయిమాక్స్‌కు చేరాయి. జూన్ ఒకటిన చివర దశ పోలింగ్ జరగనుంది. దీంతో ఏడు విడతల పోలింగ్ జరిగినట్టే. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి రోజుకు రెండు సభలకు హాజరవుతున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ క్రమంలో పార్టీ విజయావకాశాలపై ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు.


దేశంలోని వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తే బెంగాల్‌లో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందన్నా రు. అక్కడ వార్ వన్ సైడ్ ఉండబోతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఒకప్పుడు తమ పార్టీకి అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము 80 సీట్లు వరకు గెలుచుకున్నామని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లను గెలుచుకున్నామని వివరించారు.

ప్రస్తుతం అధికార టీఎంసీ ఉనికి కోసం పోరాడుతోందన్నారు మోదీ. అక్కడున్న అధికార టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టారన్నారు. ఎన్ని దారుణాలు జరిగినా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఓటు వేశారన్నారు. అంతేకాదు ఓటర్ల సంఖ్య ఈసారి పెరిగిందన్నారు.


Also Read: Modi relax at Kanyakumari: ఈసారి సౌత్.. కన్యాకుమారిలో మోదీ బస, నార్త్ మాటేంటి?

రీసెంట్‌గా కోల్‌కతా హైకోర్టు ముస్లింల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. 114 వర్గాలను ఓబీసీలో చేర్చడాన్ని తప్పుబట్టారు. న్యాయస్థానం తీర్పుతో పెద్ద మోసం బయటపడిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయల కోసం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమన్నారు.

పనిలోపనిగా బెంగాల్ పక్కనే ఉన్న ఒడిషా గురించి కూడా మాట్లాడారు ప్రధాని నరేంద్రమోదీ. ఈసారి ఒడిషాలో ప్రభుత్వం మారబోతోందన్నారు. నవీన్ సర్కార్‌కు జూన్ నాలుగు వరకు గడువు ఉందన్నారు. అదే నెల 10న బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఈసారి ఏపీ మాదిరిగానే ఒడిషా శాసనసభ, లోక్‌సభ‌కు ఎన్నికలు జరిగాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. మాకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అక్కడి ప్రజలు రాబోయే భవిష్యత్తు కోసం ఎన్నుకుంటున్నారని, ఈ విషయంలో తమ సంబంధాలను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు.

Also Read: జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. మారబోయే నిబంధనలివే

ఎన్నికల తర్వాత మాకు ఎవరితోనూ శత్రుత్వం ఉందన్నారు ప్రధాని. అటు కాశ్మీర్‌లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదుపై మాట్లాడారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసి ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందు నుంచి తనపై వస్తున్న దుర్భాషలు వింటూనే ఉన్నానని, ఆ గాలి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల ప్రవర్తన అలాగే ఉంటుందన్నారు. నిరాశలో ఉన్నవారు దూషించడం ఒక స్వభావంగా మారిపోయిందని సెటైర్లు వేశారు.

మొత్తానికి ప్రధాని ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వింటుంటే ఎక్కడ చూసినా తమ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పకనే చెప్పారు. మరో వారం రోజులు వెయిట్ అండ్ సీ.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×