EPAPER

PM Modi Virtual Inaugurations : ఐఐఎం విశాఖ, ఐఐటీ జమ్మూ, ఐఐటీ హైదరాబాద్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi Virtual Inaugurations : ఐఐఎం విశాఖ, ఐఐటీ జమ్మూ, ఐఐటీ హైదరాబాద్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi Inaugurations Today : ప్రధాని నరేంద్రమోదీ నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోదీ. తిరుపతిలో ఐఐటీ, కర్నూల్ లో ఐఐటీ, హైదరాబాద్ లో ఐఐటీలను వర్చువల్ గా ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహిస్తుండగా… ఆనందపురం మండలం గంభీరం వద్ద మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు.


విశాఖకు మణిహారంగా నిలిచే ఐఐఎం శాశ్వత భవన నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టారు. మొదటి విడతలో ఫ్యాకల్టీ బ్లాక్‌, పరిపాలన భవనంతోపాటు, విద్యార్థులకు వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తరగతి గదులు నిర్మించారు. అలాగే క్యాంపస్‌ ప్రాంగణంలో 7,200 వృక్ష, ఫల, పూలజాతి మొక్కలను నాటనున్నారు. 15 వందల కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంటును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తికానుంది.

Read More : రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. షార్ట్ నోటిఫికేషన్ విడుదల


తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాశ్వత భవానలను కూడా వర్చువల్‌గా ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ ఏర్పేడు సమీపంలో రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌ శంతాను భట్టాచార్య పాల్గొన్నారు.

“ప్రధాన మంత్రి వర్చువల్ మోడ్‌లో కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అకడమిక్ కాంప్లెక్స్‌లో 52 ల్యాబ్‌లు, 104 ఫ్యాకల్టీ ఆఫీసులు, 27 లెక్చర్ హాల్స్ ఉన్నాయి. క్యాంపస్‌లో దాదాపు 1,450 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంది. 1,400 కంటే ఎక్కువ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్నారు.” అని ఐఐటి జమ్మూ డైరెక్టర్ తెలిపారు.

Read More : కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాలు నో.. ఢిల్లీ చలో పాదయాత్ర రీస్టార్ట్..

జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియం వద్దకు వచ్చిన తర్వాత.. ప్రధాని మోదీ రూ.32,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, మోదీ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ కు ఇప్పుడు ఐఐటీ, ఐఐఎంలను తీసుకొచ్చామని, మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు (KVలు) 13 కొత్త నవోదయ విద్యాలయాలు (NV) కోసం 20 కొత్త భవనాలను కూడా ప్రారంభిస్తారని పీఎంఓ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐదు కేంద్రీయ విద్యాలయ క్యాంపస్‌లు, ఒక నవోదయ విద్యాలయ క్యాంపస్, నవోదయ విద్యాలయాల కోసం ఐదు మల్టీపర్పస్ హాల్‌లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కొత్తగా నిర్మించిన ఈ కెవిలు, ఎన్‌వి భవనాలు విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని PMO ఒక ప్రకటనలో తెలిపింది.

దేశానికి అంకితం చేయబడిన ప్రాజెక్టులలో IIT భిలాయ్, IIT తిరుపతి, IIT జమ్మూ, IIITDM కర్నూల్ శాశ్వత క్యాంపస్‌లు ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (IIS) -అధునాతన సాంకేతికతలపై మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ కాన్పూర్ లో ఉంది. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం కు చెందిన రెండు క్యాంపస్‌లు – దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్), అగర్తల (త్రిపుర)లో ఉన్నాయి. ప్రధాని మోదీ అంకితం చేయనున్న ఈ విద్యా ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.13,375 కోట్లు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×