EPAPER

PM Modi : ‘పారిస్‌లో ఉక్కపోతకు ఏసీ లేకపోతే నన్ను మీరంతా తిట్టుకున్నారా?’.. ఒలింపిక్ ఆటగాళ్లతో మోదీ సరదా!

PM Modi : ‘పారిస్‌లో ఉక్కపోతకు ఏసీ లేకపోతే నన్ను మీరంతా తిట్టుకున్నారా?’.. ఒలింపిక్ ఆటగాళ్లతో మోదీ సరదా!

PM Modi meets Olympic Medallists| పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో శుక్రవారం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం తరువాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఒలింపిక్ ఆటగాళ్లతో ప్రధాని చాలా సరదాగా మాట్లాడుతూ జోకులు కూడా వేశారు.


ఒలింపిక్స్ సమయంలో పారిస్‌ లో విపరీతమైన వేడి కారణంగా ఉక్కపోతతో ఆటగాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారని.. కొందరి గదుల్లో ఏసీలో కూడా లేవని వార్తలు వచ్చాయి. పారిస్ లో ఈసారి ఎకో ఫ్రెండ్లీ ఒలింపిక్స్ జరిగాయి. అందుకు గాను ఒలింపిక్స్ కమిటీ ప్రకృతిని హాని కలిగించే ఏసీలను ఆటగాళ్ల గదుల్లో ఏర్పాటు చేయలేదు. ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించాలని భారత క్రీడా మంత్రిత్వశాఖ 40 పోర్టబుల్ ఏసీలను ఒలింపిక్స్ విలేజ్ కు తరలించింది. ఈ సందర్భాన్ని ప్రధాని గుర్తుకు చేస్తూ.. ఆటగాళ్లతో ముచ్చటించారు.

”ఏంటి మీరందరూ పారిస్ లో ఉక్కపోత భరించలేక ఏసీలు కూడా లేవని అడిగారంట?.. ఏసీలు తరలించేందుకు ఆలస్యమైతే నన్ను ఎవరెవరు తిట్టుకున్నారు? .. నాకు తెలుసు అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని. పైగా ఏసీల సౌకర్యం కూడా లేదు. మరి మోదీజీ చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏసీలు ఏర్పాటు చేయలేరా? అని ముందుగా తిట్టుకున్నది ఎవరో చెప్పాలి?,” అని ప్రధాని సరదాగా మాట్లాడుతూనే. ఆటగాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.


ఆ తరువాత బ్యాడ్మింటన్ ప్లేయన్ లక్ష్య సేన్ తో మోదీ మాట్లాడారు. లక్ష్యసేన్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రధాని మోదీ లక్ష్య సేన్ తో తొలిసారి ఎప్పుడు కలిసారో గుర్తుకు చేసుకొని, ”నువ్వు చాలా పెద్దవాడిపోయావ్ లక్ష్య.. నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఒక సెలెబ్రిటీగా మారిపోయావ్.” అని జోక్ చేశారు. దాని లక్ష్యసేన్ ఒలింపిక్స్ లో తన కోచ్ ప్రకాశ్ పదుకొనె తన మొబైల్ తీసేసుకున్నారని.. ఫిర్యాదు చేశాడు. ఆటసమయంలో మొబైల్ నుంచి దూరంగా ఉండాలని ఆయన కఠినంగా వ్యవహరించాడని తెలిపాడు. దానికి ప్రధాని మోదీ బదులిస్తూ.. ”ప్రకాశ్ సర్ చాలా డిసిప్లిన్ మనిషి. చాలా కఠినంగా ఉంటారు. నేను మెసేజ్ చేస్తాను లే.” అని చమత్కరించారు.

లక్ష్య సేన్ తరువాత హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తో ప్రధాని ముచ్చటించారు. హర్మన్ ప్రీత్‌ని అతని నిక్ నేమ్ ‘సర్పంచ్ సాబ్’ తో సంబోధించారు. ”ఏం సర్పంచ్ సాబ్ హాకీ క్వార్టర్ ఫైనల్ లో బ్రిటన్ తో చాలా కష్టపడ్డారంటా?.. ” అని అడిగారు. ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్, బ్రిటన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 40 నిమిషాల కంటే ఎక్కువ సేపు సాగింది. ఈ మ్యాచ్ గురించి హర్మన్ ప్రీత్.. ప్రధానికి వివరించాడు. ”అవును మోదీజీ మ్యాచ్ చాలా కష్టంగా సాగింది. మా జట్టు ఇక ఓడిపోవడం ఖాయమని నిరుత్సాహంగా భావించిన సమయం నేను మర్చిపోలేను. అప్పుడు మాకు ఆ బ్రిటన్ తెల్లదొరలతో ఉన్న శత్రుత్వం గుర్తుకు వచ్చింది. ఇంకేముంది రెచ్చిపోయి ఆడాం. మ్యాచ్ 1-1 స్కోర్ తో టై అయినా షూట్ అవుట్ లో ఇండియా విజయం సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఒక మ్యాచ్ 42 నిమిషాల పాటు సాగడం ఇదే తొలిసారి”. అని చెప్పాడు.

హర్మన్ ప్రీత్ మాటలకు ప్రధాని మోదీ గట్టిగా నవ్వారు. ”సరే బ్రిటీష్ వాళ్లతో మా శత్రుత్వం 150 ఏళ్లపైగా సాగుతూనే ఉంది. అది ఇలా ఉపయోగపడిందన్న మాట” అని బదులిచ్చారు.

Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×