EPAPER

PM Modi: ప్రచారం ముగిశాక ప్రతిసారి ఇలాగే చేస్తున్న మోదీ .. తాజాగా తమిళనాడులో..

PM Modi: ప్రచారం ముగిశాక ప్రతిసారి ఇలాగే చేస్తున్న మోదీ .. తాజాగా తమిళనాడులో..

PM Modi Offers Prayers at Bhagavthy Amman Temple: గురువారం సాయంత్రం 5 గంటలకు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో నేతలు రిలాక్స్ అవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికి ముందునుంచే ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయినంక కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. 200కు పైగా బహిరంగ సభలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇక ప్రచారాలు ముగియడంతో ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లారు.


కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ధ్యాన మండపంలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. అయితే, ఎన్నికల ప్రచారం ముగిసినంక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తుంటారు. దీనికి అనుగుణంగానే ఆయన మే 30వ తేదీన కన్యాకుమారికి చేరుకుని జూన్ వరకు అక్కడే ఉండనున్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా ఆయన ఆధ్మాత్రిక యాత్రలకు వెళ్లారు. కేదార్ నాథ్ ను సందర్శించారు. అంతకుముందు 2014 లో శివాజీ ప్రతాప్ గఢ్ ను సందర్శించిన విషయం తెలిసిందే.

Also Read: దేశవ్యాప్తంగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం


కాగా, లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటివరకు 6 దశల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 1న ఏడో దశ – చివరి దశ పోలింగ్ జరగనున్నది. ఆ రోజుతో 2024 పార్లమెంటు ఎన్నికలు ముగియనున్నాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే, ఈసారి అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రాబోతున్నామంటూ కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×