EPAPER

Pawan Campaign: కర్ణాటకకు పవన్, గాలితో మంతనాలు, ఎప్పుడు..?

Pawan Campaign: కర్ణాటకకు పవన్, గాలితో మంతనాలు, ఎప్పుడు..?

Pawan Kalyan Campaign in Karnataka for BJP: దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా బలం లేని బీజేపీ, ఎన్నికల వేళ తన మిత్రులను బాగానే వినియోగించుకుంటోంది. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా నేతల చేత ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్ కొయంబత్తూరు వెళ్లగా, ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతైంది.


జనసేన అధినేత పవన్‌ తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఏపీలో పలుమార్లు తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారాయన. తాజాగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను ఆయనకు అందజేసింది బీజేపీ. తెలుగు ప్రజలు అధికారంగా ఉన్న ప్రాంతాలైన బళ్లారి, రాయచూరు, చిక్కబళ్లాపుర, దక్షిణ బెంగుళూరు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో పవన్‌కు అభిమానులు భారీగా ఉన్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న పవన్‌ కల్యాణ్ బళ్లారికి వెళ్తున్నారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతుగా రోడ్ షో చేపట్టనున్నారు. తొలుత బళ్లారి సిటీ మీదుగా గడిగి చెన్నప్ప వరకు ప్రచారం సాగ నుంది. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లనున్నారు.


Also Read: Rameshwaram Cafe Blast Case : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. రీసెంట్‌గా బీజేపీ తీర్థం పుచ్చుకున్న గాలి జనార్థన్‌రెడ్డి.. శ్రీరాములుకు మద్దతుగా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గాలి జనార్థన్‌రెడ్డితో పవన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేతలు చెబుతున్నారు. గతంలో గాలి ఇంట మ్యారేజ్‌కి పలువురు సెలబ్రిటీలు వెళ్లారు. అయినా కూటమిలోని నేతలు సమావేశమైతే తప్పేంటని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×