EPAPER

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఫస్ట్‌ ఫేజ్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ జరిగింది. కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఇవే ఫస్ట్ ఎన్నికలు. ఇష్టంతో వేస్తున్నారో.. కసితో వేస్తున్నారో తెలియదు కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో అయితే రికార్డ్ స్థాయిలో జరిగింది పోలింగ్.. ఇందర్‌వాల్‌ 80 పర్సెంట్‌.. పదార్‌ నాగసెనీ 80.67 పర్సెంట్.. కిస్తవర్‌ 78.11 పర్సెంట్‌.. ఇలా రికార్డ్ స్థాయిలో నమోదైంది పోలింగ్ పర్సంటేజ్.. అనంతనాగ్‌, పహల్గామ్‌ జిల్లాల్లోని 7 నియోజకవర్గాల్లో ఏకంగా 67.86 పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. పుల్వామా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో 50.42.. రాజ్‌పోరా 48.07.. పాంపోర్‌లో 44.74.. ట్రాల్‌లో 43.21 శాతం.. నిజానికి ఇది ఎవ్వరూ ఊహించలేదు కానీ జరిగిపోయింది.

అయితే భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ఓటింగ్‌ ఎవరికి మేలు చేయనుంది? అనేది అంతు బట్టడం లేదు. ఈ ఎన్నికల్లో ఫరూఖ్‌ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్.. మహెబూబా ముఫ్తీకి చెందిన PDP.. కాంగ్రెస్‌, బీజేపీ మాత్రమే పోటీ చేయడం లేదు. ఇంజనీర్‌ రషీద్‌ లాంటి వేర్పాటువేదాలకు చెందిన అవామీ ఇత్తేహాద్‌ పార్టీ బరిలో ఉంది. ఈ పార్టీ నిషేధిత జమాతే ఇస్లామీతో పొత్తు పెట్టుకొని మరీ పోటీ చేస్తోంది. మరికొంత మంది వేర్పాటువాదులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. మరి ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడ్డాయా? లేక ఈ వేర్పాటు వాదులకు పడ్డాయా? అనేది తేలాల్సిన అంశం. ఇది ఓటింగ్ శాతం.. ఇప్పుడు పాకిస్థాన్‌ పంచాయతీ ఏంటో చూద్దాం.


Also Read: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

పాకిస్థాన్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. ఆయన ఏమంటున్నాడంటే.. షేహబాజ్ షరీఫ్‌ గవర్నమెంట్‌ అంటే ప్రస్తుతం పాక్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌.. ఈ మూడు ఒకే ఆలోచనతో ఉన్నాయి. అదేంటంటే ఆర్టికల్ 370ను తిరిగి ఇంప్లిమెంట్ చేయడం. ప్రస్తుతం కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తుంది. అలా అధికారంలోకి రాగానే తిరిగి ఆర్టికల్ 370 అమల్లోకి వస్తుంది. పాకిస్థాన్‌ అదే కోరుకుంటుంది.. కశ్మీర్‌ ప్రజలు కూడా అదే కోరుకుంటుంది. ఇది ఆయన చెబుతున్న మాటలు.. ఇప్పుడీ వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి.

నిజానికి ఆర్టికల్ 370కి సంబంధించి ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్‌ హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం చాలా సైలెంట్‌గా ఉంది. అనుకూలమని చెప్పలేదు.. వ్యతిరేకమని కూడా చెప్పలేదు. కశ్మీర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి ఏం చెప్పలేదు. ఇప్పుడు పాక్‌ మంత్రి వ్యాఖ్యలపై అన్ని పార్టీలు సైలెంట్‌గా ఉన్నాయి.. ఒక్క పార్టీ తప్ప.. అదే బీజేపీ.. ఈ వ్యాఖ్యలను మరోసారి తమ అస్త్రంగా మలుచుకునేందుకు రెడీ అయిపోయింది బీజేపీ.. ఓ ఉగ్రవాద దేశం కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను వెనకేసుకొస్తుంది. గురుపన్వంత్ సింగ్‌ పన్నూ, రాహుల్‌గాంధీ లాంటి వారు ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారంటూ ట్వీట్ చేసింది. ఇందులోకి పన్నూన్‌ను ఎందుకు లాగారంటే.. పన్నూన్‌ రీసెంట్‌గా రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే అతని పేరును కూడా మెన్షన్ చేసింది బీజేపీ.. అంతేకాదు మోడీని గద్దె దించేందుకు కాంగ్రెస్ అవసరమైతే పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తుందంటూ విమర్శల వర్షం కురిపిస్తోంది.

కాబట్టి.. కశ్మీర్‌ ఎలక్షన్స్‌ మాత్రం చాలా హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. ఫస్ట్‌ ఫేజ్‌ ముగిసింది. మరో రెండు ఫేజ్‌లు జరగాల్సి ఉంది. మరి ఈలోపు ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో చూడాలి. ఏదేమైనా ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం ఎవరి అంచనాలకు అందకుండా ఉంటాయనేది మాత్రం కన్ఫామ్.

Related News

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×