EPAPER
Kirrak Couples Episode 1

Parliament latest news : మణిపూర్ పై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం..

Parliament latest news : మణిపూర్ పై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం..
Parliament session updates

Parliament session updates(Latest political news in India) : మణిపూర్ అంశం పార్లమెంట్ ను కుదుపేస్తోంది. ఈ వర్షాకాల సెషన్ లో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. ప్రతిపక్షాల ఆందోళనతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా పార్లమెంట్ లో అదే పరిస్థితి ఎదురైంది. మణిపూర్ అంశాన్ని రూల్‌ 267 కింద చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. అలాగే రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.


సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ప్రధాని మోదీ
కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తాజాగా పరిణామాలపై చర్చించారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విపక్షాలు 9 రోజులపాటు సభా సమయాన్ని వృథా చేశాయని వెల్లడించారు.


Related News

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Viral Video: వామ్మో.. ఈ ఖడ్గమృగాన్ని చూడండి.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సడెన్‌గా…

Work Pressure: హర్రర్ జాబ్.. 45 రోజులుగా నిద్రలేదు, చివరికి తన ప్రాణాలను తానే…

Cows are Rajya Mata: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర “రాజ్యమాతగా” ఆవు

Big Stories

×