EPAPER

Olive Oil Prices : రికార్డుస్థాయికి ఆలివ్ నూనెల ధరలు.. రీజన్ ఇదేనా ?

Olive Oil Prices : రికార్డుస్థాయికి ఆలివ్ నూనెల ధరలు.. రీజన్ ఇదేనా ?

Olive Oil Prices : ఆలివ్ ఆయిల్.. వేరుశెనగ, సన్ ఫ్లవర్ ఆయిల్స్, పామాయిల్ కంటే కూడా.. ఆలివ్ ఆయిల్ ను వంటల్లో వాడటం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు డైటీషియన్స్. ముఖ్యంగా ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ బారిన పడకుండా ఉంచుంతుంది. ఆరోగ్యాన్నిచ్చేవి ఏవైనా.. అందుబాటు ధరలో లభ్యంకావని తెలిసిందే కదా. ఆలివ్ ఆయిల్ కూడా అంతే. మామూలు ఆయిల్స్ కంటే.. ఆలివ్ ఆయిల్ ధర డబుల్, త్రిపుల్ ఉంటుంది. ఇప్పుడు దీని ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ధర మరింత పెరుగుతుంది. ఈ ఏడాది మే నెలలో.. ప్రపంచంలోని సగం ఆలివ్ నూనె సరఫరాకు మూలమైన గ్లోబల్ ప్రైస్-సెట్టర్ స్పెయిన్, గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి దాదాపు 48% తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని ఉత్పత్తి కేంద్రమైన దక్షిణ యూరప్‌లోని తోటలపై వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రభావం చూపుతుండటంతో.. ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుంది.


కీలక ఉత్పాదక దేశాలలో వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న కరువులు, హీట్‌వేవ్‌లు, కార్చిచ్చులు వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలోని ఆలివ్‌ల పంటలను దాదాపు సగానికి తగ్గించాయి. ఫలితంగా ఆలివ్-నూనె ధరలను రికార్డు స్థాయికి పెంచాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో గ్లోబల్ బెంచ్‌మార్క్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో టన్నుకు 9000 వేల డాలర్లకి చేరుకున్నాయి. ఆగస్టులో స్పానిష్ ప్రభుత్వం వేసిన అంచనా అందరిలోనూ భయాన్ని రేపింది. మధ్యధరా దేశాల్లో పొడివాతావరణం, కరువు కారణంగా.. ఆలివ్ ఆయిల్ మార్కెట్లలో సంక్షోభం తలెత్తింది. తీవ్రమైన ఎండలు, కార్చిచ్చులు ఆలివ్ పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

ఆలివ్ ఆయిల్ సరఫరా సంక్షోభం.. గతేడాదితో పోలిస్తే మరింత పెరిగిందని, ఈ ప్రభావం యూరప్, యూఎస్, భారతదేశం వరకూ ఆహార మార్కెట్లు, రెస్టారెంట్లతో పాటు సాధారణ వినియోగదారులపై పడుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. భారత్ లో వర్జిన్ ఆలివ్ ఆయిల్ ధర 22 శాతం పెరిగిందని కమోడిటీస్-ట్రేడింగ్ సంస్థకు చెందిన అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం భారత్ 12 వేల మెట్రిక్ టన్నుల ఆలివ్ ఆయిల్ ను వినియోగిస్తున్నట్లు ఇండియన్ ఆలివ్ అసోసియేషన్ తెలిపింది. మే నెలలో.. ఇటాలియన్ ప్రభుత్వం పాస్తా ధరలలో 20% జంప్ అయిన తర్వాత సంక్షోభ సమావేశానికి పిలుపునిచ్చింది. ఇది రాజకీయ నిరసనలను ప్రేరేపించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023/2024 పంట సంవత్సరంలో స్పెయిన్ ఉత్పత్తి నాలుగు సంవత్సరాల సగటు కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంది.


స్పెయిన్‌లో ఆలివ్-చమురు ధరలు కనీసం జూన్ వరకు రికార్డు స్థాయిలో ఉంటాయని అక్టోబర్ 26న రాయిటర్స్ నివేదిక పేర్కొంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాని ప్రపంచ ఆలివ్-ఆయిల్ ఉత్పత్తి అంచనాను 2.5 మిలియన్ టన్నులకు తగ్గించింది. ఇది ఐదేళ్ల సగటు కంటే పావు వంతు తక్కువ.రాష్ట్ర వాతావరణ సంస్థ AEMET ప్రకారం.. స్పెయిన్ ఈ సంవత్సరం దాని మూడవ హాటెస్ట్ వేసవిని నమోదు చేసింది. అక్కడ సగటు వేసవి ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.3 డిగ్రీలు ఎక్కువగా ఉంది.”వాతావరణ మార్పు యూరప్ ఆహారాన్ని పండించే విధానాన్ని మారుస్తోంది” అని దక్షిణ ఐరోపాలోని ఆలివ్ పెంపకందారుల సమాఖ్య నాయకుడు డోరతీ అజోరీ గత నెలలో తమ జర్నల్‌లో పేర్కొన్నారు. ఫలితంగా ఆలివ్ ఆయిల్ ధరలపై వాతావరణంలో వచ్చే మార్పుల ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×