Big Stories

Odisha Rail Track: రైళ్లు మళ్లీ రయ్ రయ్.. ఎక్స్‌ప్రెస్ ఆపరేషన్..

odisha train

Odisha Rail Track: బాలాసోర్ ప్రమాద ఘటనాస్థలంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. రైల్వే సిబ్బంది రాత్రనకా.. పగలనకా శ్రమిస్తున్నారు. ఆదివారం రాత్రికి ఒక ట్రాక్ ను పునరుద్ధరించారు. ఆ ట్రాక్ ద్వారా గూడ్స్ రైళ్లను పంపించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి అన్ని ట్రాక్ లను అందుబాటులోకి తెచ్చారు. ఆ మార్గం గుండా ప్రయాణీకుల రైళ్లనూ నడిపిస్తున్నారు. ఉదయం నుంచి పూరీ –హౌరా మార్గాల్లో అన్ని సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

- Advertisement -

ఇక ప్రమాద స్థలాన్ని రెండు రోజుల్లోనే మళ్లీ ప్రయాణానికి అనువుగా మర్చిన రైల్వే సిబ్బంది పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహా ప్రమాదం నుంచి తేరుకొని పని చేసిన ప్రతీ ఒక్కరినీ ప్రయాణీకులు అభినందిస్తున్నారు.

- Advertisement -

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌కు ఎలాంటి కాల్స్ రావడం లేదన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమరన్నాథ్‌. ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మందికి స్వల్ప గాయలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని.. జనరల్ బోగీలో ప్రయాణించిన శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి ఒక్కరే మృతి చెందారని మంత్రి తెలిపారు. ఏపీకి చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు సహాయం అందించేందుకు ఇంకా భువనేశ్వర్లో ఉన్నారని మంత్రి తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News