EPAPER

Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court


Supreme Court: లంచ కేసులపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల లాంటి ప్రజాప్రతినిధులకు మినహాయింపులేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు, మాట్లాడేందుకు , ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే అలాంటి ప్రజాప్రతినిధులకు ఆ కేసు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. పార్లమెంట్ , అసెంబ్లీల్లో సభ్యులు అవినీతి చేస్తే ఆ ప్రజాప్రతినిధులను విచారణ చేయడంపై  ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై 1998లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

2012లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కేసు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. అప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటు వేయడానికి లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని సీతా సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


2019లో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ నిర్వహించింది. చట్ట సభల్లో సభ్యులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసువచ్చా? చట్టసభ సభ్యులకు రక్షణ ఉంటుందా? ఈ అంశాలు ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొంది. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.

Read More: మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతా.. ఈడీకి కేజ్రీవాల్ సమాధానం..

జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ కేసును ఇటీవల సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది. చట్ట సభల్లో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని 1998లో పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో ఇచ్చిన తీర్పు సమీక్షించాలని స్పష్టం చేసింది. దీని కోసం ఏడుగుర సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కేసును విచారణ చేసిన రాజ్యంగ ధర్మాసనం తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. అవినీతికి పాల్పడేవారికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని స్పష్టం చేసింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని తేల్చింది.

1993లో ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఈసమయంలో జేఎంఎం ఎంపీ శిబు సోరెన్ తోపాటు మరో నలుగురు ఆ పార్టీ ఎంపీలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వారు ఐదుగురు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అందువల్లే పీపీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో నెగ్గిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఐదుగురు జేఎంఎం ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే జేఎంఎం ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీలకు లంచం కేసుల విచారణను మినహాయింపు ఇస్తూ 1998లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×