EPAPER

Nigeria Drug Gang Arrested: నైజీరియా టు ఇండియా.. పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా

Nigeria Drug Gang Arrested: నైజీరియా టు ఇండియా.. పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ తయారవుతాయా? కావు.. అయ్యే చాన్స్‌ కూడా లేదు. అయినా కానీ మరి రాష్ట్రంలో డ్రగ్స్ ఈ స్థాయిలో ఎందుకు దొరుకుతున్నాయి? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఈ క్వశ్చన్స్‌కు ఆన్సర్స్‌ను పట్టేశారు పోలీసులు.. ఒక్క హైదరాబాద్‌ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సరఫరా అయ్యే డ్రగ్స్‌ మొత్తం నైజీరియా నుంచే వస్తున్నాయి. ఇది పక్కా ఆధారాలతో సహా తెలుసుకున్నారు పోలీసులు. డ్రగ్స్‌ నైజీరియా టు హైదరాబాద్‌ వయా ఢిల్లీ ద్వారా వస్తున్నట్టు తెలుసుకున్నారు. కాబట్టి.. హైదరాబాద్‌లో తీగ లాగితే.. ఏకంగా నైజీరియాలో డొంక కదిలిందని అర్థమవుతోంది.

డ్రగ్స్‌ నైజీరియా నుంచే వస్తున్నాయి.. ఓకే.. మరి ఎలా వస్తున్నాయి? ఎబుకా, ఆనౌహ బ్లెస్సింగ్‌, ఫ్రాంక్లిన్‌, అజీజ్, గౌతమ్, వరుణ్‌, షరీఫ్‌.. ఈ కేసులో ఈ పేర్లు చాలా కీలకం.. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారో చూద్దాం.. ఎబుకా సుజి.. ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్.. అంటే ఈ డ్రగ్స్‌ దందాకు కర్త, కర్మ, క్రియ అన్నట్టు.. నైజీరియాలోనే ఉంటూ తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ ఎబుకా డ్రగ్స్‌ను తరలించేందుకు ఓ మహిళకు బాధ్యతలు అప్పగించాడు. ఆమే ఆనౌహా బ్లెస్సింగ్స్.. ఈ బ్లెస్సింగ్స్‌ నైజీరియా నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తుంది. అయితే ఇదేలా సాధ్యమవుతోంది.. నైజీరియా, ఢిల్లీలో కస్టమ్స్‌ నిఘా నుంచి ఎలా తప్పించుకుంటున్నారు? అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి  బ్లెస్సింగ్స్‌తో డ్రగ్స్‌ గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నాయి. దీనికి ఫ్రాంక్లిన్‌ సహాకారం అందిస్తూ ఉంటాడు.


ఇది ఫస్ట్‌ ఫేజ్.. ఇక సెకండ్ ఫేజ్‌లో ఈ డ్రగ్స్‌ను వినియోగదారులకు అమ్మాలి. దీని కోసం కూడా ఓ నెట్‌వర్క్‌ను రెడీ చేసుకుంది ఈ ముఠా.. దీని కోసం లోకల్స్‌ను పెడ్లర్స్‌ను రంగంలోకి దించింది. తెలుగు స్టేట్స్‌ బాధ్యతను వరుణ్‌, గౌతమ్‌, షరీఫ్‌లకు అప్పగించింది. వీరు కూడా తమ బాధ్యతలను చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. వరుణ్‌.. హైదరాబాద్‌లోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టు, గచ్చిబౌలి లాంటి ఏరియాస్‌లో డ్రగ్స్‌ అమ్ముతున్నాడు. ఇక గౌతమ్‌ హైదరాబాద్‌తో పాటు.. రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్‌ చేరుతున్నాయి. వీరి కింద మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.. వారు కూడా డ్రగ్ అడిక్టర్స్‌కు సరఫరా చేస్తున్నారు.

ఈ మొత్తం దందాను చాలా పక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న బ్లెస్సింగ్స్ ఏకంగా తన ఫ్రెండ్ పేరతో ఓ ఫేక్ పాస్‌పోర్ట్‌ను కూడా రెడీ చేసుకుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా ఫేక్‌ పాస్‌పోర్ట్‌ను అప్పగించేసి.. బెయిల్‌పై బయటికి వచ్చి తన ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌తో నైజీరియాకు వెళ్లిపోయేందుకు స్కెచ్ వేసింది. మన తెలంగాణ పోలీసులు అంతకు మించి కదా.. మొత్తం కక్కించేశారు. దీంతో పడిన కష్టం అంతా వృథా అయిపోయింది. ఈ కేసులో చాలా ఆసక్తికర, ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి.

నెంబర్ వన్.. హైదరాబాద్‌లోనే కాదు.. ఏపీలో కూడా డ్రగ్స్‌ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా ఏపీ నార్కోటిక్‌ బ్యూరో గుర్తించలేకపోయింది. ఇప్పటికైనా ఏపీ పోలీసులు అలెర్ట్ కాకపోతే.. మరింత నష్టం జరుగుతుంది. నెంబర్‌ టూ.. నేషనల్‌ నార్కోటిక్‌ బ్యూరో డ్రగ్స్‌ రవాణాను గుర్తించలేకపోయింది. రాజధాని ఢిల్లీ మీదుగానే రవాణా జరుగుతున్నా ఏ ఒక్క సెంట్రల్ ఏజెన్సీ కూడా గుర్తించలేకపోయింది. నెంబర్ త్రీ.. డ్రగ్స్‌ సరఫరా కోసం స్థానికులనే పావులుగా వాడుకుంటుంది నైజీరియా ముఠా..ఏదైనా తప్పు జరిగితే అడ్రస్ లేకుండా వెళ్లిపోవడానికి పక్కా ప్లాన్స్‌ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. నెంబర్ ఫోర్.. ఒక్కసారి డ్రగ్స్‌ అలవాటైతే వదిలించుకోవడం చాలా కష్టం.

Also Read: మొరార్జీ దేశాయ్ పేరున ఎక్కువసార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్.. త్వరలో ఆ రికార్డు బ్రేక్!

అందుకే వారికి అలవాటు చేసేందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు.. నెంబర్ ఫైవ్.. బిజినెస్ జరగని సమయంలో కూడా పెడ్లర్స్‌కు డబ్బులు అందజేస్తున్నారు. లాస్ట్‌ 9 మంత్స్‌లో ఏకంగా పెడ్లర్స్‌కు 10 లక్షల రూపాయల వరకు ట్రాన్స్‌ఫర్ చేసింది ముఠా.. దీనిని బట్టే అర్థమవుతుంది.. డబ్బుల ఆశ చూపించైనా తమ దందా కంటిన్యూ అయ్యేలా చూసుకుంటోందని నెంబర్ సిక్స్.. బ్లెస్సింగ్స్ ఇప్పటి వరకు ఏకంగా 20 సార్లు డ్రగ్స్‌ సరఫరా చేసిందని తేలింది. అంటే చాలా పెద్దమొత్తంలోనే డ్రగ్స్ రావడం.. వాటిని అమ్మడం.. బాగానే డబ్బు సంపాదించడం జరిగిందని తెలుస్తోంది.

పోలీసుల విచారణలో మరో ఇంట్రెస్టింగ్‌ విషయం కూడా తెలిసింది. ఎవరైతే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొస్తుందో.. ఈ బ్లెస్సింగ్స్‌కు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆమె తండ్రి ఓ బస్సు డ్రైవర్.. ఇంట్లో కష్టాలు ఎక్కువవడంతో.. ఈ బిజినెస్‌లోకి దిగిందని.. కానీ ఇది క్షమించే విషయమా? కాదు కదా.. తన కష్టాలను తీర్చుకునేందుకు ఈ ముఠా ఓ జనరేషన్‌ను నాశనం చేయడం సరైందేనా? కాబట్టి.. పోలీసులు క్షమించే సీన్‌ అయితే కనిపించడం లేదు.

హైదరాబాద్‌లో ఇలాంటి బ్లెస్సింగ్స్‌ ఎంత మంది ఉన్నారు? దేశంలో ఈ ముఠాకు చెందిన వారు ఇంకెంత మంది ఉన్నారు? ఒక్కో సిటీలో ఎలా తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు? ఏపీలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ నెట్‌వర్క్‌ను ఎలా విస్తరించారు? ఎలా సప్లై చేస్తున్నారు? ఇంకా చాలా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు, నార్కోటిక్‌ బ్యూరో వీటికి సమాధానాలు తెలుసుకుంటేనే.. ఈ మొత్తం నెట్‌వర్క్‌ను కూకటి వెళ్లతో సహా పెకిలించగలుగుతుంది. లేదంటే ఇలాంటి బ్లెస్సింగ్స్‌ పుట్టుకోస్తూనే ఉంటారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×