EPAPER

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌ నిందితుడి ఆచూకీ కోసం ఎన్‌ఐఏ భారీ నజరానా

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌ నిందితుడి ఆచూకీ కోసం ఎన్‌ఐఏ భారీ నజరానా

NIA on Rameshwaram cafe blast


NIA on Rameshwaram cafe blast(Today news paper telugu): భారత్‌లో ఐటీ కారిడార్‌ని కలిగిన నగరం బెంగళూరు. ఈ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం రామేశ్వరం కేఫ్‌. ఈ కేఫ్‌కి రోజుకు వేలాది కస్టమర్లు వస్తుంటారు. ఈనెల 1న జరిగిన పేలుడు ఘటనతో బెంగళూరు నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలో 9 మందికి పైగా గాయాలపాలవగా..ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణను కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ధర్యాప్తును కొనసాగించాలని ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. కానీ, ప్రధాన నిందితుడి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ ఓ కీలక ప్రకటన చేసింది.

కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో గతవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ముష్కరుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు రాష్ట్ర పోలీస్ శాఖా. ఈ కేసు విచారణను ఎన్ఐఏ మంగళవారం స్వీకరించిగా… తాజాగా..నిందితుడి ఆచూకీకి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది ఎన్‌ఐఏ. రూ.10 లక్షల నజరానా ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది. నిందితుడి వివరాలు అందించిన వారి వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించిన ఇప్పటికే ఎన్‌ఐఏ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.


Read More: అద్భుతం, వైద్య చరిత్రలో మరో రికార్డు చేతులు అమర్చి..

మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ పేలుడులో పదిమందికి పైగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగును కేఫ్‌లో గుర్తించారు కర్నాటక పోలీసులు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిందితుడి విజువల్స్ పూర్తిగా రికార్డ్ అయ్యాయి. మాస్క్‌, టోపీ, అద్దాలను ధరించి పూర్తిగా ముఖం ఎవరికి కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. కేఫ్‌కి వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి, ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ని అక్కడే చెట్టు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ నిందితుడు వెళ్లిపోయిన కాసేపటికే కేఫ్‌లో బాంబు పేలుడు సంబవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రామేశ్వరం కేఫ్‌లోనే దాదాపు 9 నిముషాల పాటు నిందితుడు ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి క్లుప్తంగా అర్థమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిందితుడిని గుర్తిస్తామని కర్నాటక రాష్ట్ర పోలీస్ అధికారులు ప్రకటించారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆదివారం ఓ ప్రకటన చేశారు. ఆ వెంటనే ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Read More: సూసైడ్ అంటూ ‘హనుమాన్‌ జంక్షన్‌’ నటి వీడియో.. అతడే నా చావుకి కారణం!

పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు రాష్ట్రమంతటా జల్లెడ పడుతున్నారు కర్నాటక పోలీసులు. నిందితుడిని ఎలాగైనా పట్టుకొని తీరుతామని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరేచోట జరగకుండా ముందస్తుగా రాష్ట్రమంతటా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అటు కర్నాటకతో పాటుగా ఇటు హైదరాబాద్‌ని సైతం సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తూ పలు సూచనలు చేసింది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×