EPAPER

New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఎప్పటినుండంటే..?

New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఎప్పటినుండంటే..?

New criminal laws ImplementationNew Criminal Laws Implementation: కొత్త క్రిమినల్ చట్టాలు – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం- జూలై 1,2024 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.


ఈ మూడు చట్టాల ప్రారంభ తేదీకి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు మూడు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అదే సమయంలో, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106లోని సబ్ సెక్షన్ (2) అమలును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. 106(2) నిర్దిష్ట నిబంధన ‘ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారా ఒక వ్యక్తి మరణానికి కారణం’ అనే దానికి సంబంధించింది.

Read More: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..


“భారతీయ న్యాయ సంహిత, 2023 (45 ఆఫ్ 2023)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా పేర్కొన్న అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2024 తేదీని ప్రకటించాం. ఒక్క సెక్షన్ 106లోని సబ్-సెక్షన్ (2) నిబంధన తప్ప, మిగతాది అమలులోకి వస్తుంది” అని MHA నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను వరుసగా రద్దు చేసి, భర్తీ చేసే ఈ చట్టాలను డిసెంబర్ 21, 2023న పార్లమెంట్ ఆమోదించింది. డిసెంబర్ 25, 2023న రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాయి. అయితే, చట్టాలు కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుండి మాత్రమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తాజాగా ఈ చట్టాలు జులై 01, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.

 

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×