EPAPER

Baba Siddiqui Shot dead: ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య, మూడు రౌండ్లు కాల్పులు.. హత్య ఎవరి పని?

Baba Siddiqui Shot dead: ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య, మూడు రౌండ్లు కాల్పులు.. హత్య ఎవరి పని?

Baba Siddiqui Shot dead: మహారాష్ట్రలో దారుణ చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురయ్యారు. అతి సమీపంలో సిద్ధిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


అసలేం జరిగింది? దసరా సందర్భంగా ముంబైలో శనివారం రాత్రి పార్టీ ఆఫీసు దగ్గర బాణా సంచా పేలుస్తున్నారు మాజీ మంత్రి, 66 ఏళ్ల బాబా సిద్ధిక్. ఆ సమయంలో ఓ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని బయటకు వచ్చారు. వెంటనే తమతో తెచ్చుకున్న పిస్టల్‌తో సిద్ధిక్‌పై కాల్పులు జరిపారు.

మూడు రౌండ్లపాలు కాల్పులు జరిపారు. ఒకటి ఛాతీలో మరొకటి కడుపులోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే సిద్ధిక్‌ను సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో మృతి చెందారు.


66 ఏళ్ల బాబా సిద్ధిక్ అజిత్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేత. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కర్నైల్ సింగ్, మరొకరు ధరమ్‌రాజ్‌గా తెలుస్తోంది. కాల్పుల్లో బాబా సిద్ధిక్ కారు డ్యామేజ్ అయ్యింది.

ALSO READ: కశ్మీర్​లో కేంద్రం మాస్టర్ స్ట్రాటజీ… రాష్ట్రపతి పాలనకు బైబై

ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధిక్ హత్య విషయం తెలియగానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన మృతి సంతాపం తెలిపారు. మంచి స్నేహితుడ్ని కోల్పోయానని చెప్పారు.

మరోవైపు ఎన్సీపీ నేతపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారని, మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని వెల్లడించారు.

ఇదిలావుండగా బాబా సిద్ధిక్ హత్య విషయం తెలియగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. బిగ్ బాస్ షూటింగ్ ను క్యాన్సిల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఘటన విషయం తెలియగానే సెట్స్ నుంచి లీలావతి ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.

బాబా సిద్ధిక్ ముంబైలో బాద్రా నియోజకవర్గంలో మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-2008 కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు కూడా. మహారాష్ట్రలో మారిన రాజకీయ నేపథ్యంలో ఆయన అజిత్ పవార్ వర్గం వైపు వెళ్లారు. సిద్ధిక్‌కు బాలీవుడ్‌తో మంచి సంబంధాలున్నాయి.

 

 

Related News

IT Company Dasara gift: ఉద్యోగులకు ఆ ఐటీ కంపెనీ ఊహించని గిఫ్ట్, కార్లు, బైక్‌లు..

Jammu & Kashmir : కశ్మీర్​లో కేంద్రం మాస్టర్ స్ట్రాటజీ… రాష్ట్రపతి పాలనకు బైబై

Bagamathi Train : ఓ మై గాడ్, భాగమతి రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులా… రైల్వేశాఖ ఏం చెప్పిందంటే ?

Haryana New Government : హరియాణాలో కొత్త సర్కార్… ముహూర్తం ఎప్పుడంటే ?

Mohan Bhagawath : భారత్​ను అస్తిరపర్చేందుకు బంగ్లాదేశ్​లో భారీ కుట్రలు : ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ

Big Stories

×