EPAPER

Narendra Modi: మూడో ప్రపంచ యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉందా?

Narendra Modi: మూడో ప్రపంచ యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉందా?

Narendra Modi wants to stop the war between Ukraine-Russia with peaceful discussions: రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో ఇరు దేశాల సైన్యం పోరాడుతున్నాయి. దాదాపు రెండేళ్లకు పైగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా దేశాలను ఏ ఒక్కరూ నిలువరించే సాహసం చేయడం లేదు. ఇప్పుడా పని తాను చేస్తానంటున్నారు మోదీ. యూఎన్ఓ ప్రతిపాదనలను సైతం లెక్క చేయని ఈ రెండు దేశాలు ఇప్పుడు మోదీ మాట వింటాయా అని సందేహం. మోదీ కూడా అంత ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నారు? నిజంగానే యుద్ధం ఆగిపోయి ఇరు దేశాల మధ్య సంధి కుదుర్చితే మోదీ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోతుంది.


మోదీ విదేశాంగ విధానం

మోదీ 2014లో అధికారం చేపట్టినప్పటినుంచి దాదాపు 78 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఎనిమిది సార్లు అమెరికాలో పర్యటించారు. రష్యా జర్మనీ దేశాలను ఆరు సార్లు సందర్శించారు. ఎక్కువ సార్లు విదేశాలు పర్యటించిన ప్రధానిగా మోదీ రికార్డు సాధించారు. మోదీ చాలా సందర్భాలతో భారత్ ఎప్పుడూ తటస్థ దేశం కాదు..శాంతిని కోరుకునే దేశం అని చెప్పేవారు. ఈ విషయంలో విశ్వగురు గా కీర్తించబడుతున్నారు మోదీ. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై రెండు సంవత్సరాలకు పైబడుతుతోంది. ఇలా యుద్ధ వాతావరణం సమయంలో ఆ రెండు దేశాలను సందర్శించారు మోదీ. ప్రపంచంలోని ఏ దేశాధినేతా ఈ సాహసం చేయలేదు. ఆఖరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడైనా చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ కూడా ఇలాంటి సాహసం చేయలేకపోయారు.


మధ్యవర్తిగా మోదీ

ఉక్రెయిన్ పర్యటనలో బిజీగా ఉన్న మోదీ రెండు దేశాల మధ్య జరిగే శాంతియుత చర్చలకు తాను మధ్యవర్తిగా ఉంటానని..వీలైతే ఇరు దేశాధినేతలు కలిసుండేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఒక పక్క మోదీ శాంతి వచనాలు పలుకుతున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. మోదీ తలుచుకుంటే ఇరు దేశాధ్యక్షులను కలిపి మీటింగ్ ఏర్పాటు చేయగలరు. ఎందుకంటే ఇరు దేశాధ్యక్షులు మోదీకి అత్యంత సన్నిహితులు. మోదీపై ఎనలేని గౌరవం కలిగిన నేతలు. అసలే కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని విలవిల లాడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇలాంటి పరిస్థితి లో మూడో ప్రపంచ యుద్ధాన్ని తట్టుకోగలవా అనేది ప్రశ్నార్థకం. చరిత్ర చూసుకుంటే మొదటి, రెండు ప్రపంచయుద్ధాలతో జరిగిన నష్టానికి ఈ నాటికీ కోలుకోలేకపోతున్నాయి కొన్ని దేశాలు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే అణ్వాయుధ ప్రయాగాలు చేశారు. ఇప్పుడు అత్యంత ప్రమాదకర రసాయన యుద్ధాలు జరిగితే యావత్ ప్రపంచమే సర్వనాశనం అవుతుంది.

ఇరు దేశాలకూ మిత్రుడే

అప్పట్లో అమెరికా అండ చూసుకుని పాకిస్తాన్ భారత్ పై తెగబడదామని అనుకుంది. కానీ రష్యా భారత్ కు అండగా నిలవడంతో పాక్ తోకముడిచింది. ఉక్రెయిన్ లో భారత పౌరులు చాలా మందే ఉన్నారు. ఎక్కువగా చదువుల నిమిత్తం ఉక్రెయిన్ దేశంలో ఉంటున్నారు. ఇప్పుడు మన దేశ విద్యార్థుల కోసమైనా నరేంద్ర మోదీ నడుం బిగించక తప్పదంటున్నారు. భారత్ మొదటినుంచి చెబుతున్న మాట ఒక్కటే చర్చల ద్వారానే పరిష్కార మార్గం సాధ్యం అంటోంది. యూఎన్ఓ నిర్వహించిన ఓటింగ్ లోనూ ఆనాడే భారత వైఖరి స్పష్టం చేశారు మోదీ. ఇప్పుడు ఎలాగైనా ఈ రెండు దేశాల మధ్య సంధి కుదర్చడం ద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పాలనే మోదీ కృత నిశ్చయం నెరవేరాలని కోరుకుందాం..

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×