EPAPER

PM Modi in Big Trouble: మోదీకి ఆ నేతలు హ్యాండ్ ఇస్తే.. అంతే ఇక

PM Modi in Big Trouble: మోదీకి ఆ నేతలు హ్యాండ్ ఇస్తే.. అంతే ఇక

BJP Faces Major Defeat In Lok Sabha Elections 2024: అనుకున్నది జరగకపోగా.. మ్యాజిక్ ఫిగర్‌కి కూడా ఎసరుపడింది. పార్లమెంట్‌లో సంపూర్ణ మెజారీటీతో స్థిరమైన గవర్నమెంట్ ఉంటుందని మోదీ ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు, ఆయన చెప్పిన స్థిరత్వం ప్రభుత్వం కోల్పుతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లు.. నితీష్‌ని నమ్ముకొన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక అంతే సంగతులు.. అయితే, ఇప్పుడు బీజేపి దగ్గర ఇంతకుమించి మార్గం ఉందా..? ఏంటీ వైపరిత్యం..? ఇది ఎటు దారి తీస్తుంది..?


ఎగ్జిట్ పోల్ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది ప్రతిపక్ష ఇండియా కూటమి. తుది ఫలితాలకు కొన్ని నిమిషాలకు ముందున్న లెక్కల ప్రకారం 241 స్థానాల్లో మాత్రమే బిజెపి ఆధిక్యంలో ఉంది. అయితే, గట్టి పోటీ మధ్య, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 300 మార్కుకు కూడా చేరుకోలేకపోయింది. 297 నెంబర్ దగ్గర తొణికిసలాడుతూ ఉంది. దీని ప్రకారం బీజేపి సొంతంగా మెజారిటీ మార్కును చేరుకోవడంలో విఫలమయ్యింది. ఇక, ఇప్పుడున్న మార్గం ప్రాంతీయ పార్టీల సహకారం. ముఖ్యంగా.. ఏపీలో విజయ దుంధుబి మోగించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్రెడీ బీజేపితో అంటకాగుతున్న జెడియు అగ్రనేత నితీష్ కుమార్‌తో పాటుగా చిన్నాచితకా నెంబర్లను కలుపుకొని పీఠం ఎక్కాల్సిందే. ప్రస్తుతం, ప్రపంచ పాపులర్ ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి ఇది. ఇప్పుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చంద్రబాబు నాయుడుతో చర్చలు ప్రారంభించారు.

నిజానికి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ ఆజ్యం పోసిన ఇండియా కూటమి ఇప్పుడు గ్రాండ్‌గా కనబడుతోంది. ముఖ్యంగా, అత్యధిక లోక్ సభ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపికి ఇండియా కూటమి షాకిచ్చింది. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో బీజేపి తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయిన సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ టిఎంసి కనీసం 32 స్థానాల్లో ఆధిక్యాన్ని పొందగలిగింది. ఇక, మహారాష్ట్రలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఊహించని నెంబర్లను సంపాదించింది. ప్రత్యేకించి బీజేపి రెండుగా విడిపోయిన తర్వాత ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో ఇండియా కూటమి బలాన్ని పెంచింది. ప్రాంతీయ పెద్దలైన శివసేన, ఎన్సీపీలు వేసిన ప్లాన్‌కు అధికార బిజెపి ఖంగుతింది. ఇక్కడ ప్రతిపక్షం 30 స్థానాల్లో నిలువగా, ఎన్డీయే కేవలం 17 సీట్లతో వెనుకంజలో ఉంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారే కేంద్ర బీజేపికి దిక్కయ్యారు. ఇక, ఇందులో ఎవ్వరు హ్యాండ్ ఇచ్చినా కేంద్రంలో బిజేపికి బ్యాండ్ తప్పదు. ముఖ్యంగా, బీహార్ నుండి నితీష్ కుమార్ విషయంలో ఇప్పుడు బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయం అంటే రంగులు మార్చడమే అన్నట్లు.. జెండాలు.. అజెండాలు పక్కనపెట్టేసి.. సొంత లాభం చూసుకోవడమే నితీష్ రాజకీయం. ‘నా పొలిట్రిక్స్ రూటే సపరేటు.. నా రాజకీయంలో నీతికి చోటే లేదు..’ అన్నట్లు నితీష్ సుదీర్ఘ రాజకీయ జీవితం చెబుతుంది. “పార్టీ ఏదైతేనేం.. నా పదవి నాకుండాలి..” ఇదే సీనియర్ పొలిటీషియన్ నితీష్ స్టైల్. సిద్ధాంతాలను చెప్పుకోడానికి గోడపైన అతికిచ్చుకున్నా.. అమలులో మాత్రం చెత్త బుట్టలో వేయడం ఆయనకు అలవాటు. ఎవరు ఏమైపోయినా, తాను మాత్రం సీఎం సీటు దిగకూడదు.. అదీ ఆయన ఫిలాసఫీ. ఒకవేళ, సీఎం సీటు దిగాల్సి వస్తే.. అది పీఎం సీటు ఎక్కిన తర్వేతే అన్నట్లుంది పెద్దాయన పొలిటికల్ తంత్రం. ఇలాంటి వ్యక్తిని నమ్ముకొని ఇప్పుడు బిజెపి గద్దెనెక్కాల్సి ఉంది.

Also Read: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

2013లో నితీష్ కుమార్ మొదటిసారి పొత్తు నుండి విడిపోయాడు. అప్పటికి బీహార్‌లో JDU-BJP కూటమి సుదీర్ఘ కాలం పాటు స్థిరత్వానికి ఒక ఉదాహరణగా ఉంది. నితీష్ కుమార్ తన జేడీయూ పార్టీ నుండి కేంద్రంలోని బీజేపీకి స్ట్రాంగ్ మద్దతు పలికారు. అయితే, 2013లో కొత్త బిజెపి నాయకత్వం, కొత్త శకం రావడం.. గుజరాత్‌ నుండి నరేంద్ర మోదీ పేరును పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పెద్దాయన అలిగారు.

బీజేపీకి పీఎం అభ్యర్థిగా తాను తప్ప మరే దారి లేదు అనుకున్న నితీష్ కుమార్‌ ఆశ నిరాశ కావడంతో, 17 సంవత్సరాల బీజేపీ-జేడీయూ పొత్తును ముగించేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. ఇందులో ఓటమి తర్వాత నితీష్ పరాజయానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జేడీయూ బద్ధ ప్రత్యర్థి అయిన లాలూ పార్టీ రాష్ర్టీయ జనతాదళ్ మద్దతుతో మళ్లీ పీఠం ఎక్కారు. రెండేళ్లలోనే ఈ ‘మహాఘటబంధన్‌’లో చీలికలొచ్చాయి. ఇక, 2024 ఎన్నికల సమయానికి నితీష్ తిరిగి బిజెపీ పంచన చేరారు. ఇప్పుడు, బిజెపీ మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకోకపోవడంతో నితీష్ ఎటైనా దూకొచ్చని డౌటు బిజెపిని పట్టి పీడిస్తుంది.

ఇక ఇప్పుడు బీజేపి ముందు ఉన్న మార్గం కూటమిలో ఉన్న పార్టీలతో సాధ్యమైనంత సామరస్యంతో ఉండటమే.. స్థిరమైన ప్రభుత్వం మాట అటుంచి, ఐదేళ్లూ ఏ చీలకా లేకుండా సర్థుకోవడమే.. గత దశాబ్ధ కాలంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకునే వీలుండకపోవచ్చు. పాలసీ పరంగా ఎలాంటి మార్పు చేయాలన్నా ముందుగా కూటమిలో ఉన్న కీలక పార్టీని అడగాల్సిందే.. లేదంటే, మౌనంగా పాలన చేసుకుంటూ ప్రయాణం చేయాల్సిందే..

 

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×