EPAPER

Nara Lokesh @ Coimbatore: కోయంబత్తూరులో నారా లోకేష్.. అక్కడ ఎలక్షన్ వన్ సైడ్..!

Nara Lokesh @ Coimbatore: కోయంబత్తూరులో నారా లోకేష్.. అక్కడ ఎలక్షన్ వన్ సైడ్..!

Nara Lokesh Elections 2024 Campaign in Coimbatore: మరో వారం రోజుల్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంకా ప్రచారానికి ఐదురోజులే ఉండడంతో కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తరపున ప్రచారం చేశారు టీడీపీ యువనేత నారా లోకేష్.


అన్నామలై పోటీ చేస్తున్న కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించారు నారా లోకేష్. అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలతోపాటు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అధికంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యంగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన నేత ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రజల సేవ చేయడం కోసం ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి అన్నామలై అని గుర్తు చేశారు నారా లోకేష్.

ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి అన్నామలై అని చెప్పారు నారాలోకేష్. ఈ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు గెలుపు ఖాయమని మనసులోని మాట బయటపెట్టారు. ఆయనకు మద్దతు ఇవ్వడానికి తాను ఇక్కడకు వచ్చానని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400పై చిలుకు సీట్లు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.


అటు అన్నామలై మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుంచి రకరకాల కంపెనీలు హైదరాబాద్‌కు తెచ్చిన ఘటన చంద్రబాబుకే దక్కిందన్నారు. ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందన్నా రు. తమిళనాడులో డీఎంకె చేస్తున్నట్లుగా ఏపీలోనూ అక్రమ కేసులు పెట్టి టీడీపీ అధినేతను అధికార పార్టీ అరెస్టు చేసిందన్నారు.

Also Read: దేశంలో అవినీతిపరులకు ‘మోదీ వాషింగ్ మెషిన్’ నుంచి క్లీన్ చిట్: రాహుల్ గాంధీ

ఏపీలోనూ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తెలిపారు. ఏపీలో వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 19న జరగనున్న తొలివిడత ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది.

Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×