EPAPER

Muslim Personal Law Board| ‘మదరసాలకు దూరంగా ఉండండి’.. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలకు ముస్లిం లా బోర్డు హెచ్చరిక

Muslim Personal Law Board| ‘మదరసాలకు దూరంగా ఉండండి’.. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలకు ముస్లిం లా బోర్డు హెచ్చరిక

Muslim Personal Law Board| మదరసాలను మూసివేయించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరికను జారీ చేస్తూ.. దేశంలోని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర జాతీయ ముస్లిం సంస్థల నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ స్కూల్స్, మదరసాలకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముస్లిం మత పెద్దలు చెప్పారు.


”భారత దేశ పౌరులమైన మేము.. .. మదరసాలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సం లాంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను ఖండిస్తున్నాం. మదరసాలు, ఇతర మైనారిటీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని జాతీయ పిల్లల హక్కుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాలు.. చట్టవ్యతిరేకం.. అవి పిల్లల హక్కుల సంఘం పరిధిలో లేవు.. అని స్పష్టం చేస్తున్నాం,” అని ముస్లిం సంఘాలు తమ ప్రకటనలో తెలిపాయి.

జాతీయ పిల్లల హక్కుల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ.. మదరసాలలో చదువుకునే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. దీని కోసం 8449 ఇండిపెండెంట్ మదరసాలు, గుర్తింపు లేని పాఠశాలలు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో దారుల్ ఉలూమ్ దేవ్ బంద్, జాబితాలో దారుల్ ఉలూమ్ నద్వాతుల్ ఉలేమా, మజాహిర్ ఉలూమ్ సహారన్ పూర్ లాంటి గొప్ప గొప్ప ముస్లిం విద్యా సంస్థలు ఉండడం గమనార్హం.


Also Read: చేతబడి.. టీనేజ్ అమ్మాయి తలలో నుంచి 77 సూదులు తొలగించిన డాక్టర్లు

”చీఫ్ సెక్రటరీ ఆదేశించడంతో జిల్ల కలెక్టర్లు పాఠశాలలపై పిల్లలని ప్రభుత్వ స్కూళ్లలో మార్చాలని ఒత్తిడి చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు, జిల్ల కలెక్టర్ పెట్టే ఒత్తిడి చట్టపరంగా చెల్లవని ముస్లిం సంస్థల నాయకులు తెలిపారు. మదరసాలలో నాన్ ముస్లిం విద్యార్థులను ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు మార్చారు. ఇలాంటి బలవంతపు చర్యలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పిల్లలు ఏ విద్యాసంస్థలో చదువుకోవాలో అది వారి ఇష్టం, హక్కు,” అని ప్రకటనలో పేర్కొన్నారు.

”అంతే కాకుండా విద్యా హక్కుచట్టాన్ని చూపి ముస్లిం స్టూడెంట్స్ లను కూడా గవర్న్ మెంట్ స్కూల్స్ లోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారు. మదరసాలు, ముస్లిం స్కూల్స్ యజమాన్యాలను అధికారులు బెదిరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే మదరసాలలో పిల్లల చేత బలవంతంగా సరస్వతి వందనం పూజలు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా రాజ్యాంగంలో ఆర్టికల్ 30(1) ప్రకారం చట్టవ్యతిరేకం. రాజ్యాంగం మైనారిటీల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలు స్థాపించే హక్కు కలిగించింది. పైగా విద్యాహక్కు చట్టం నుంచి మైనారిటీ విద్యా సంస్థలకు మినహాయింపు ఉంది. ముస్లిం విద్యాసంస్థల్లో హై క్వాలిటీ చదువులను ఉచితంగా అందిస్తున్నారు. చదువుకునే పిల్లలకు ఉచితంగా భోజన, హాస్టల్ వసతి సదుపాయాలు ఉన్నాయి. వీటితో ముస్లిం మైనారిటీల అభివృద్ధి జరుగుతుంది. ఈ పురాతన విద్యాసంస్థలు, అందులో చదువుకొని పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న విద్యార్థులలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారున్నారు.” అని గుర్తుచేస్తున్నాం.

”ఇప్పుడు ఒక్కసారిగా యుపి చీఫ్ సెక్రటరీ ముస్లి విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆదేశాల వల్ల మదరసాలలో చదువుకునే లక్షల మంది పిల్లలకు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల మదరసాలకు వ్యతిరేకంగా పనిచేసే రాష్ట్రాల చర్యలు చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఇలా చేయడం అప్రజాస్వామికమని తెలుపుతూ.. ఆ రాష్ట్రాల వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని,” ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు హెచ్చరించాయి.

 

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×