EPAPER

SC on Chandigarh Mayoral Polls : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం.. చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం

SC on Chandigarh Mayoral Polls : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం.. చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం
Supreme Court on Chandigarh Mayoral Polls

Supreme Court on Chandigarh Mayoral Polls:చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం కోర్టులో ఫిబ్రవరి 5 సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఎన్నికల అధికారి అనిల్ మసీహ్ అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోందని మౌఖింగా అన్నారు.


ఎన్నికల నిర్వహణ సమయంలో ఉన్న సీసీటీవి వీడియోలను జస్టిస్ డీవై చంద్రచూడ్ వీక్షించి ఆశ్చర్యపోయారు. బ్యాలట్ పత్రాలను నాశనం చేసేందుకు ఎన్నికల అధికారి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. తప్పు చేస్తున్న భయం ఆ వ్యక్తి ముఖంలో కనపడుతోందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ ఇలాగేనే చేసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి అనిల్ మసీహ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ప్రజాస్వామ్యం ఖూనీ చేసేందుకు ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.

చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో మొత్తం 36 ఓట్లు పోల్ అవగా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి 20 ఓట్లు, బిజేపీకి 16 ఓట్లు దక్కాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన 20 ఓట్లలో 8 ఓట్లు చెల్లుబాటు కావని ఎన్నికల అధికారి నిర్ణయిస్తూ.. బీజేపీ విజయం సాధించిందని ప్రకటించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఎన్నికల అధికారి అవినీతికి పాల్పడ్దారని పంజాబ్ హర్యాణా హై కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టు ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ కేసుని ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.


Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×