Big Stories

Rahulgandhi resigns From Wayanad : డైలమాకు ఎండ్‌ కార్డ్‌.. వయనాడ్ కు రాహుల్ గాంధీ రాజీనామా

Rahul gandhi resigns From Wayanad seat(Political news telugu): ఇన్నాళ్ల పాటు కొనసాగుతున్న డైలమాకు ఎండ్‌ కార్డ్‌ పడింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్నది తేలిపోయింది. ఆయన తనకు వయనాడ్‌ను వద్దని.. రాయబరేలీనే ముద్దని తేల్చేశారు. అయితే వయనాడ్‌లో నెక్ట్స్‌ ఏం జరగబోతుంది ? రాయబరేలీనే రాహుల్ చూస్ చేసుకోవడానికి రీజన్సేంటి ?

- Advertisement -

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి వయనాడ్‌, మరోకటి రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు రాహుల్. కానీ ఎలక్షన్ కమిషన్‌ రూల్స్ ప్రకారం రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని మాత్రం రాహుల్ వదులుకోవాల్సిందే. రిజల్ట్స్‌ వచ్చిన రోజు నుంచి దీనిపైనే డిస్కషన్‌. రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారు..? ఏ నియోజకవర్గ ఎంపీగా కంటిన్యూ అవుతారు ? సో.. ఫైనల్‌గా కాంగ్రెస్‌ ఈ విషయాన్ని తేల్చేసింది. రాహుల్‌ రాయ్‌బరేలీ ఎంపీగానే కంటిన్యూ అవుతారు. అంతేకాదు వయనాడ్‌ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారు. దీంతో ఈ డిస్కషన్‌కి ఎండ్ కార్డ్ పడింది.

- Advertisement -

మరి రాయ్‌బరేలీనే ఎందుకు? వయనాడ్‌ ఎందుకు వద్దు? ఈ నిర్ణయం వెనక కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కూడా కనిపిస్తుంది. ఫస్ట్‌ రాయ్‌బరేలీకి వద్దాం. టు బీ ఫ్యాక్ట్.. వయనాడ్‌ కూడా రాహుల్‌ను రాయ్‌బరేలీతో సమానంగా ఆదరించింది. అయితే రాయ్‌బరేలీలో రాహుల్‌కు 30 వేల మేజారిటీ ఎక్కువ వచ్చింది. ఇదొక్కటే రీజన్‌ కారణంగా అయితే రాహుల్‌ వయనాడ్‌ను వదులుకోలేదు. రాయ్‌బరేలీ స్థానం అనేది కొన్ని తరాలుగా కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న నియోజకవర్గం. అందుకే తాను కూడా అక్కడ వారసుడిగా ఉండాలని ఆలోచించినట్టు కనిపిస్తుంది.

Also Read : బీజేపీ పాలిత రాష్ట్రాలే పేపర్ లీకేజీలకు కేంద్రాలు: రాహుల్ గాంధీ

రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ 1952లో ఇక్కడి నుంచే పోటీ చేశారు. 1967లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1971, 1980లో రాయ్‌బరేలీ మళ్లీ గెలిచారు. 1989, 1991, 1999లో జరిగిన ఎలక్షన్స్‌లో కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇక 2004 నుంచి 2024 వరకు సోనియాగాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసి ఏకంగా 4 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. అందుకే ఈ నియోజకవర్గంతో గాంధీ కుటుంబానికి ప్రత్యేకమైన ఎమోషనల్‌ బాండింగ్ ఉంది.

ఇక మరో రీజన్‌ ఏంటంటే.. నెక్ట్స్‌ జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నెక్ట్స్‌ కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందో ఈ ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. అందుకే కాంగ్రెస్‌ దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యూపీలో కాంగ్రెస్‌ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే యూపీలో బీజేపీని గద్దె దింపొచ్చు. అలా చేస్తే కనుక బీజేపీని మోరల్‌గా దెబ్బ కొట్టినట్టే. అందుకే ఇప్పుడు వయనాడ్‌ను చూస్‌ చేసుకొని యూపీ ప్రజలకు రాంగ్‌ మెసేజ్‌ పంపే రిస్క్‌ కాంగ్రెస్‌ చేయడం లేదు.

ఇక వయనాడ్‌ విషయానికి వస్తే రాహుల్ రాజీనామా చేసినా.. ఆ స్థానంలో ప్రియాంకగాంధీని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు. బయటి వ్యక్తి కాకుండా ఏకంగా సొంత చెల్లెల్ని బరిలోకి దింపడం కూడా కాస్త కనెక్ట్ అయ్యే అంశమే. ఈ నిర్ణయంతో తాను లేకపోయినా.. తన చెల్లి అండగా ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు రాహుల్. 2019, 2024 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలను తాను మర్చిపోనని.. ఇకపై వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉన్నారన్న విషయాన్ని అక్కడి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు రాహుల్.

Also Read : భారత్‌లోని పేదలు, వయనాడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ!

ఇక వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం రావడాన్ని అధృష్టంగా భావిస్తున్నారనని ప్రియాంకగాంధీ అన్నారు. తన శక్తికి మించి వయనాడ్ ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. అయితే వయనాడ్ వెళ్లినంత మాత్రానా.. యూపీ ప్రజలకు దూరం కానని ప్రియాంక అంటున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. మరి ప్రియాంక నిజంగా గెలుస్తారా? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వయనాడ్‌లో ప్రియాంక గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఎందుకంటే కేరళలో బీజేపీ కంటే కూటమి చాలా పవర్‌ఫుల్. మామూలుగానే పోటీ తగ్గిపోయింది.

ఇక మరో రీజన్ ఏంటంటే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా కూడా సీపీఐ తన అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. ఆయనకు గత ఎన్నికల్లో కంటే 9 వేల ఓట్లు కూడా ఎక్కువగా వచ్చాయి. అయినా కానీ రాహుల్‌కు ఏకంగా 3 లక్షల 60 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అన్న వారసురాలిగా బరిలోకి ప్రియాంక దిగుతుండటం ఆమెకు కలిసి రావడం ఖాయం. అంతేగాకుండా ఈసారి సీపీఐ పోటీ చేసే చాన్స్‌ కూడా లేదు. సో మరింత మద్ధతు పెరగడం ఖాయం. ఇలా ఎలా చూసుకున్నా.. ప్రియాంకగాంధీ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం ఖాయమైనట్టే చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News