EPAPER
Kirrak Couples Episode 1

Modi : అమృత్ భారత్ పథకం.. ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..

Modi : అమృత్ భారత్ పథకం..  ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..

Modi: దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని 39 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.


రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. దీంతో ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయని తెలిపారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌లో ఎంపీ బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు.

అమృత్‌ భారత్‌ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలో 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలో రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడతారు. హఫీజ్‌పేట, హైటెక్‌ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, మలక్‌పేట, మల్కాజిగిరి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, రామగుండం, కాజీపేట, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్‌, మహబూబ్‌నగర్‌, తాండూరు, యాదాద్రి , జహీరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్టేషన్లు అభివృద్ధి చేస్తారు.


ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లను అభివృద్ధి చేస్తారు. పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ,తుని, కాకినాడ టౌన్‌, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ, కర్నూలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తారు.

Tags

Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×