EPAPER
Kirrak Couples Episode 1

Mehbooba Mufti: హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

Mehbooba Mufti: హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

Mehbooba Mufti| ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా గురువారం మరణించారు. అయితే నస్రల్లా మృతికి నిరసనగా జమ్ము కశ్మీర్ లోని ప్రధాన రాజకీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) ఎన్నికల ప్రచారం ఒక రోజు నిలిపివేసింది. పిడిపి అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహ్‌బూబా ముఫ్తీ ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.


”లెబనాన్, గాజా అమరులు ముఖ్యంగా హసన్ నస్రల్లా మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ.. నా ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు (సెప్టెంబర్ 29) నిలిపివేస్తున్నాను. మేము ఈ దుఖ సమయంలో పాలస్తీనా, లెబనాన్ ప్రజలకు మద్దతుగా నిలబడి ఉన్నాము” అని ట్వీట్ చేశారు.

ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయినట్లు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపు శనివారం ధృవీకరించింది.


జమ్ము కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉంది. నస్రల్లా మృతికి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు రాజకీయ పార్టీలు పిలుపు ఇస్తున్నట్లు సమాచారం.

Also Read: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం..
గత రెండు వారాలుగా ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా హెజ్బుల్లా గ్రూపు నకు మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వం వహించిన హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేయడంతో ఇతర దేశాలు కూడా సీరియస్ గా ఉన్నాయి.

శుక్రవారం రోజు ఇజ్రాయెల్ నిరంతరాయంగా లెబనాన్ రాజధాని బేరుట్ పై రాకెట్ దాడులు చేసింది. దీంతో నగరం దద్దరిల్లిపోయింది. రాకెట్ దాడుల తరువాత ఇప్పుడు ఇజ్రాయెల్.. సైనికులు బేరుట్ లో భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు స్థానికి మీడియా తెలిపింది.

ఏడాది కాలంగా గాజాలో హమాస్ కు మద్దతుగా హెజ్బుల్లా.. ఇజ్రాయెల్ పై లెబనాన్ బార్డర్ వద్ద దాడులు చేస్తోంది. ఇప్పుడు నస్రల్లా మృతి తరువాత హెజ్బుల్లాకు అండగా నిలిచే ఇరాన్ ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇజ్రాయెల్ వైపు నుంచి అమెరికా యుద్ధరంగంలో దిగుతుంది.

హెజ్బుల్లా మృతిపై అమెరికా స్పందించింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. ”హసన్ నస్రల్లా మృతితో ఉగ్రవాద బాధితులకు న్యాయం జరిగింది.. దశాబ్దాలుగా ఎంతో మంది అమెరికన్ల మృతికి కారణమైన నస్రల్లా మరణంతో ఉగ్రవాద శకం ముగిసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది.

Related News

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Fire Cracker Factory Explosion: తమిళనాడు.. టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Big Stories

×