EPAPER

Maharashtra: రిజర్వేషన్ల రగడ.. 144 సెక్షన్.. ఇంటర్నెట్ బంద్..

Maharashtra:  రిజర్వేషన్ల రగడ.. 144 సెక్షన్.. ఇంటర్నెట్ బంద్..

Maharashtra: మహారాష్ట్రలో మరాఠీల రిజర్వేషన్‌ రగడ మరింత రాజుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న తమకు రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న ఉద్యమం విధ్వంసాన్ని సృష్టించింది. మరాఠీలకు 16శాతం రిజర్వేషన్‌కు పట్టుపడుతూ మనోజ్‌ జరంగే పాటిల్‌ మరోసారి ఆమరణ నిరాహార దీక్ష బూనారు.


ఈ నెల నుంచి రిజర్వేషన్‌ల డిమాండ్‌తో దీక్ష ప్రారంభించారు మనోజ్‌ జరంగే పాటిల్‌. వారంరోజులుగా దీక్ష చేస్తుండంతో.. ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో మరాఠీలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. మనోజ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే సందీప్‌ ప్రకాష్‌లు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మరాఠీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకి ఇంటిని ముట్టడించిన నిరసనకారులు దాడికి దిగారు. ఇంటి ముందున్న వాహనాలకు తగులపెట్టి ఆతర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే.. మరాఠా రిజర్వేషన్‌ డిమాండ్‌కు మద్దతుగా సీఎం షిండే వర్గీయులైన హింగోలి ఎంపీ హేమంత్‌ పాటిల్‌, నాసిక్‌ ఎంపీ హేమంత్‌ గాడ్సే రాజీనామా చేశారు.

మరోవైపు ఉద్యమంలో పాల్గొన్న యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిరాహారదీక్ష చేస్తున్న జరంగే పరిస్థితిని చూసి ఉద్వేగానికి లోనైన ఆందోళన కారులు ఆయన పరిస్థితిని సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేల నివాసాలకు, కార్యాలయాలకు, దుకాణాలకు నిప్పు పెడుతున్నారు. దాంతో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్థానికంగా 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.


మరాఠీల రిజర్వేషన్‌ డిమాండ్‌ ఈ నాటిది కాదు.. దశాబ్ధాల కాలం నాటిది. 32 ఏళ్ల క్రితం తొలిసారి మరాఠా రిజర్వేషన్ పై ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మత్తడి లేబర్ యూనియన్ నాయకుడు నాయకత్వం వహించారు. గతంలో మరాఠీల ఉద్యమంతో 2019లో అప్పటి ప్రభుత్వం వారికి 16శాతం రిజర్వేషన్‌ కల్పించింది. అయితే.. రిజర్వేషన్‌ పరిమితి 65 శాతాన్ని దాటడంతో.. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఇది నిబంధనలకు వ్యతిరేకమని కొందరు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం..16శాతం రిజర్వేషన్‌ సబమేనని తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2021లో ప్రభుత్వం కల్పించిన మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న శివసేన సర్కార్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇది రిజర్వేషన్ల పరిమితి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. అప్పటికే జరిగిన అడ్మిషన్లు, ఉద్యోగ నియమాకాలకు ఎలాంటి సమస్య వుండదని తెలిపింది సుప్రీంకోర్టు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×