Mann Ki Baat: ఆదివారం అక్టోబర్ 27న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశప్రజలందరికీ పండగలకు ముందే దీపావళి,ధన త్రయోదశి, గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా మాట్లాడారు.
డిజిటల్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ప్రసారం చేసి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. వీడియో కాల్‌ల ద్వారా పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అయినా విచారణ చేయదని గుర్తుంచుకోవాలన్నారు.డిజిటల్ మోసానికి దూరంగా ఉండాలని కోరారు. సైబర్ నేరగాళ్ల బారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని తెలిపారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రధాని మోదీ ఒక వీడియోను చూపించారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ వీడియోలో వ్యక్తులు మోసం చేయడానికి పోలీసు, సీబీఐ, ఇతర ఏజెన్సీల అధికారులను అనుకరిస్తూ వీడియో కాల్స్ చేస్తారు. మన్ కీ బాత్ ద్వారా దీని గురించి మాట్లాడమని చాలా మంది నన్ను కోరారు. సైబర్ నేరస్థులు మీ గురించిన వివిధ రకాల సమాచారాన్ని ముందుగానే సేకరించి, నకిలీ పోలీస్ స్టేషన్ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయాన్ని సెటప్ చేసి కాల్ చేస్తారు. ఈ వ్యక్తులు సమయం లేదని చెబుతూ బాధితులపై చాలా ఒత్తిడి తెస్తారు. ఆ సమయంలో బాధితులకు ఆలోచించే సమయం కూడా ఉండదు. సైబర్ నేరగాళ్లు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోలేడు . ఇలా దేశంలో చాలా మంది లక్షల రూపాయలు నష్టపోయారు. అందుకే దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ కోరారు.
సైబర్ నేరాలను నివారించడానికి 3 మార్గాలు:
1.ఆపండి, 2.ఆలోచించండి, 3. చర్య తీసుకోండి
సైబర్ నేరగాళ్లను నివారించడానికి ఈ రోజు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను అని ప్రధాని మోదీ ఈ క్రింది విషయాలను ప్రజలకు వివరించారు.
1. భయపడవద్దు: మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా ఇలాంటి వీడియో కాల్‌లను చేయదు. కొందరు అక్రమార్కులు అమాయక పౌరులను బలిగొంటున్నారు. మీకు అలాంటి కాల్ వస్తే, దానిని రికార్డ్ చేయండి. అంతే కాకుండా వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఏజెన్సీలకు ఫిర్యాదు చేయండి.
2. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదు. డిజిటల్ అరెస్ట్ విషయంలో జరుగుతున్న మోసానికి వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. లక్షల సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, సామాజిక ఖాతాలు కూడా ఇప్పటికే బ్లాక్ అయ్యాయి.
3. డిజిటల్ నేరగాళ్లు, సైబర్ నేరాలపై పోరాటంలో యువత, విద్యార్థులు ముందుకు రావాలి. ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి.
మోదీ ఈ అంశాలపై కూడా మన్ కీ బాత్ లో మాట్లాడారు..
– మిత్రులారా.. ఛోటా భీమ్ ప్రారంభించినప్పుడు, పిల్లలలో అద్భుతమైన ఉత్సాహం కనిపించింది. మన కృష్ణుడు, మోటు పాట్లు, ఇతర కార్టూన్ పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. దేశంలో సృజనాత్మక శక్తి వేవ్ నడుస్తోంది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా అనేవి యానిమేషన్ ప్రపంచంలో ప్రముఖమైనవి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, ప్రపంచంలోని ఇతర పెద్ద యానిమేషన్ హౌస్‌లతో కలిసి పని చేస్తున్నాయి. ఈ రోజుల్లో VR టూరిజం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మీరు వర్చువల్ రియాలిటీ ద్వారా అజంతా గుహలను కూడా చూడవచ్చు. VR వీడియోలు పర్యాటకుల మనస్సులలో భారతదేశం గురించి ఉత్సుకతను సృష్టించాయి. ప్రపంచ యానిమేషన్ దినోత్సవాన్ని అక్టోబర్ 28న జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సృజనాత్మకంగా ఉండటానికి ప్రతిజ్ఞ చేయండి.