EPAPER

Manipur Issue: మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం

Manipur Issue: మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం

Manipur HC Withdraws ST tag for Meiteis: ఉత్తర ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలాగా రగిలిపోవడానికి కారణం ఏమిటి? పచ్చనికొండల్లో.. ప్రశాంత వాతావరణంలో రెండు తెగలమధ్య చిచ్చుపెట్టిందెవరు? ఏడాదిన్నర కాలంగా ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన రిజర్వేషన్ల సమస్యపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పరిష్కారం చూపిందా? తాజాగా అక్కడి హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ఉపసంహరణతో వివాదం సద్దుమణుగుతుందా అనే సందేహాలు మణిపూర్ ప్రజానీకాన్ని నిత్యం వేధిస్తూనే ఉన్నాయి.


గత ఏడాది మార్చి 27న మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అక్కడి హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంతో పాటు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా తప్పుబట్టడంతో గురువారం తన తీర్పును సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాన్ని ట్రైబల్స్ స్వాగతిస్తుండగా, మెజారిటీలైన మైతీలు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

Read More: శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి కొత్త సింబల్.. కేటాయించిన ఎన్నికల సంఘం..


పచ్చని కొండల్లో విరాజిల్లే మణిపూర్ గుండెల్లో.. చిచ్చు రగిల్చింది రెండు తెగల మధ్య ఏర్పడిన రిజర్వేషన్ల వివాదం. మణిపూర్ లో ప్రధాన తెగలైన మైతీలు 53 శాతం ఇంఫాల్ లోయలో జీవిస్తుండగా, 40శాతం పైగా ఉన్న ట్రైబల్స్ కొండప్రాంతాలలో జీవనం సాగిస్తుంటారు. ట్రైబల్స్ లో కుకీలు, నాగాలు అనే రెండు తెగలవారు ఉంటారు. మెజారిటీ వర్గమైన మైతీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు. దీన్ని ట్రైబల్స్ వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం ఇరువర్గాల మధ్య చిచ్చురగిలించి ఇప్పటివరకూ 200 మందికిపైగా ప్రాణాలను బలిగొంది. వీరిలో మైనారిటీలైన ట్రైబల్సే అధికంగా ఉన్నారు.

రాజ్యాంగ పరంగా తమకు లభించిన రిజర్వేషన్లలో మెజారిటీ వర్గానికి భాగం కల్పించడం తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందంటూ వారు కుకీలు,నాగాలు వ్యతిరేకించారు. మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ససేమిరా అన్నారు. దీంతో రెండు వర్గాల మధ్య అల్లర్లు.. గృహ దహనాలు, దారుణ మారణకాండలు సంభవించాయి. నిత్య హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడికిపోయింది.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాలతో తమతీర్పు విభేదిస్తున్నందున మైతీలను ఎస్టీలలో చేరుస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు మణిపూర్ హైకోర్టు నిన్న వెల్లడించింది. గత ఏడాది మార్చి 27 నాటి తీర్పులో మైతీలకు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన పేరా నెంబర్ 17లోని 3వ అంశాన్ని తొలగిస్తున్నట్టు హైకోర్టు తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. మైతీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడానికి తీర్పు వెల్లడైన నాలుగు వారాలలోగా చర్యలు చేపట్టాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అప్పట్లో హైకోర్టు ఆదేశాలిచ్చింది. మైనారిటీలైన కుకీలు హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

Read More: 3 నెలల్లో మూడుసార్లు వెంటాడిన మృత్యువు.. అచ్చిరాని ఫిబ్రవరి

గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను న్యాయస్థానాలు సమీక్షించలేవని, పార్లమెంటులో చట్టసవరణలతోనే అది సాధ్యమని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ గైఫుల్ షిల్లు నిన్న హైకోర్టు తీర్పును తప్పు పడుతూ, మైతీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చారు. షెడ్యూలు తెగలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు సంబంధించి నవంబర్ 2000వ సంవత్సరం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేని స్పష్టం చేశారు.

ట్రైబల్స్ హక్కులను కాపాడే సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే విచక్షణాధికారాన్ని, 2014లో గిరిజన మంత్రిత్వశాఖ జారీచేసిన నివేదికను ఈసందర్భంగా జస్టిస్ గైఫుల్ షిల్లు గుర్తుచేశారు. హైకోర్టు మార్చి 27తీర్పులోని రిజర్వేషన్ల అంశాన్ని తక్షణం తొలగించాలని ఆయన ఆదేశించడంతో హైకోర్టు గురువారం తీర్పును సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు చంద్రచూడ్ కూడా హైకోర్టు తీర్పు దోషపూరితం, రాజ్యాంగ విరుద్ధం అని కరాఖండిగా చెప్పారు.

ట్రైబల్ పార్టీ ఐటీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి గింజా ఊల్ జాంగ్ మైతీలను ఎస్టీలలో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గిరిజనుల భూములను కబ్జాచేయడానికి మైతీలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని, వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకొని గిరిజనులకు న్యాయం చేసిందని హర్షించారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×