EPAPER

Kharge gets Emotional: రాజ్యసభలో ఎమోషనలైన ఖర్గే..

Kharge gets Emotional: రాజ్యసభలో ఎమోషనలైన ఖర్గే..

Mallikarjuna Kharge gets Emotional: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనలయ్యారు. సభలో మంగళవారం ఆయన రాజకీయ జీవితం గురించి బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. ఖర్గే కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందని ఘనశ్యామ్ తివారీ అన్నారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ ఖర్గే సభాపతిని కోరారు. తమ కుటుంబంలో తానే మొదటితరం రాజకీయ నాయకుడినన్నారు. యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ లో చేరానన్నారు. అప్పటి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందన్నారు. తన రాజకీయ జీవితంలో తాను చేపట్టిన వివిధ పదవుల గురించి సభలో ఖర్గే వివరించారు.


Also Read: ఆ నేతలకు సోనియా వార్నింగ్.. అతి నమ్మకమే కొంపముంచుతుందంటూ ఫైర్

దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ స్పందిస్తూ.. ఘనశ్యామ్ చేసిన ప్రసంగంలో ఖర్గేను తప్పు పట్టేవిధంగా వ్యాఖ్యలు ఉన్నట్లు తనకు అనిపించలేదన్నారు. రికార్డులను సూక్ష్మంగా పరిశీలించి, ఒకవేళ అటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తప్పకుండా తొలగిస్తామంటూ చైర్మన్ పేర్కొన్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×