EPAPER

Kharge comments on PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

Kharge comments on  PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

Kharge comments on PM Modi: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి‌దశకు చేరుకుంది. ఇప్పటి ఐదు దశలు పూర్తి కాగా, కేవలం మరో రెండు దశలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్ నుంచి మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది.


తాజాగా ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఆయన ఆలోచన తీరు సరైనదికాదన్నారు. ప్రజల మధ్య చీలికను తెచ్చి విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు. ప్రజాజీవితం నుంచి ఆయన ఇక వైదొలిగితే మంచిదన్నారు. ప్రధాని విభజనకు ఆజ్యం పోస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

రాజ్యాంగానికి, ముస్లింలకు వ్యతిరేకంగా నేతలు చేసిన కామెంట్స్‌ను ఆయన ఖండించలేదని గుర్తు చేశారు ఖర్గే. ఓ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారాయన. విభజన వ్యాప్తి చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారన్నారు. మోదీపై వ్యక్తి గతంగా తమ పార్టీకి వ్యతిరేకత లేదని, ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాలను మాత్రమే తప్పుబడుతున్నామని చెప్పారు.


రామాలయం, హిందూ-ముస్లిం విభజన, భారత్-పాక్ మధ్య ఘర్షణల పేరుతో బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు ఖర్గే. కమలనాథుల అసలు రంగును ప్రజలు పసిగట్టారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలెక్కడని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం గురించి మాట్లాడకుండా అధికారులు సీజ్ చేసిన మనీ గురించి మోదీ మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఈసారి ఎన్నికలు రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే అంశాల చుట్టూ తిరుగుతున్నాయన్నారు.

ALSO READ: ఎన్నికల వేళ బ్రిజ్‌ భూషణ్‌‌కు భారీ షాక్ !

అవినీతి నేతలను జూన్ నాలుగున జైలులో వేస్తామని ప్రధాని మోదీ చెబుతున్నారని, అవినీతి మరకలున్న నేతలను తమవైపు కమలనాథులు తిప్పుకున్నారని అన్నారు. వారికి ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారన్నారు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రులూ అయ్యారని వివరించారు. వారి సంగతేంటని సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి కావాల్సిన మెజార్టీని కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. ఇండియా కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, తమకు అనుకూలంగా గాలి వీస్తుందన్నారు. ఈ బలంతో బీజేపీని ఖచ్చితంగా నిలువరిస్తామనేది ఖర్గే అసలు పాయింట్.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×