EPAPER

Maharashtra Congress: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం.. చవాన్ బాటలో ఆ ఎమ్మెల్యేలు..?

Maharashtra Congress: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం.. చవాన్ బాటలో ఆ ఎమ్మెల్యేలు..?
Maharashtra Congress Ashok Chavan

Maharashtra Congress news(Telugu flash news): మిలింద్ దేవరా, బాబా సిద్ధిక్‌ల ఫిరాయింపుల తర్వాత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిష్క్రమణతో కాంగ్రెస్‌కు అతిపెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన చవాన్ ఫిబ్రవరి 15న బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాగా ఆయన రాజీనామా తర్వాత పార్టీ నుంచి మరి కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.


ఆదర్శ్ కుంభకోణంలో విచారణలో ఉన్న చవాన్ మాస్ లీడర్. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడా తనకుంది. పార్టీలో ఆయనకు చాలా మంది విధేయులు ఉన్నారని, రానున్న రోజుల్లో వారు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చవాన్ రాజీనామా చేసిన వెంటనే శాసనమండలి మాజీ సభ్యుడు అమర్‌నాథ్ రాజుర్కర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా, మరో 18 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

వీరిలో జితేష్ అంతపుర్కర్, మోహన్ హంబర్డే, నాందేడ్ నుంచి మాధవరావు పవార్, లాతూర్ నుంచి అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్, విజయ్ వాడెట్టివార్ ఉన్నారు.


ఎన్‌సీపీలో చేరుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్న వారిలో బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్, అస్లాం షేక్ కూడా ఉన్నారు. వాడెట్టివార్, షేక్ అమీన్ పటేల్ సోషల్ మీడియాలో ఈ వార్తలను ఖండించారు.

Read More: కాంగ్రెస్‌కు అశోక్ చవాన్ రాజీనామా.. బీజేపీలో చేరే ఛాన్స్..

చవాన్ షాక్ తర్వాత, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చర్యకు దిగింది. బుధవారం తన ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బాలాసాహెబ్‌ థోరట్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌ తదితర సీనియర్‌ నాయకులు శాసనసభ్యులందరినీ సంప్రదించి తాము పార్టీతోనే ఉన్నామని అందరూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వారిలో ఒక్కరు కూడా ఎక్కడికీ వెళ్లడం లేదని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. బీజేపీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు.

పలుస్-కడేగావ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ తన గురించి అవాస్తవాలు బయటపెడుతున్నారని పేర్కొన్నారు. “నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించకుండా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను” అని కదమ్ సోమవారం వీడియో సందేశంలో తెలిపారు.

చవాన్‌కు సన్నిహితుడిగా భావించే రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ కూడా పార్టీ నుండి వైదొలగడం లేదని ఖండించారు. అశోక్ చవాన్ నిర్ణయం దురదృష్టకరం, దిగ్భ్రాంతికరం అని ఆయన అన్నారు. ఇతర పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేయడంతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×