EPAPER

MP Vasantrao Chavan: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఎంపీ వసంత్ రావ్ చవాన్ కన్నుమూత!

MP Vasantrao Chavan: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఎంపీ వసంత్ రావ్ చవాన్ కన్నుమూత!

MP Vasantrao Chavan| మహారాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ వసంత్ రావ్ చవాన్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసు గల నాందేడ్ ఎంపీ వసంత్ రావ్ ఆగస్టు 26, సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. చాలా రోజులగా అనారోగ్యం కారణంగా ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


అయితే ఆదివారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. ఆ తరువాత డాక్టర్లు ఆయనను కాపడడానికి ఎంత ప్రయత్నించినా ఉదయం 4 గంటలకు వసంత్ రావ్ చవాన్ మరిణించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు సమీపంగా మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గం ఉండడంతో చవాన్ హైదరాబాద్ కు చికిత్స కోసం వచ్చారు.

2024 సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు వసంత్ రావ్ చవాన్.. బిజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ రావ్ పాటిల్ ని 59 వేల భారీ మెజారీటీతో ఓడించారు. వసంత్ రావ్ చవాన్ కు ఈ ఎన్నికల్లో 5,28,894 ఓట్ల లభించగా, ఆయన ప్రత్యర్థికి 4,69,452 ఓట్లు పొలయ్యాయి. ఎన్నికల సమయానికి చవాన్ ఆరోగ్యం బాగోలేదని సమాచారం. అప్పటికే మహారాష్ట్ర రాజకీయాలలో వసంత్ రావ్ చవాన్ సన్నిహితుడు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ ను వీడి బిజేపీలోకి చేరడంతో వసంత్ రావ్ గెలుపు క్లిష్టంగా మారింది. అయినా వసంత్ రావ్ కు ఎన్నికల్లో భారీ ప్రజాదరణ లభించింది.


నాందేడ్ లోని నాయిగావ్ జిల్లా లో జన్మించిన వసంత్ రావ్ చవాన్ గ్రామ పంచాయితీ సభ్యుడిగా సుదీర్థ కాలం పనిచేశారు. ఆ తరువాత 1990 నుంచి 2002 వరకు జిల్లా పరిషద్ సభ్యుడిగా పనిచేశారు. 2002లో వసంత్ రావ్ మహారాష్ట్ర ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.

ఆ తరువాత 2009లో నాయి గావ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వసంత్ రావ్ చవన్ 2021 నుంచి 2023 వరకు నాందేడ్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వీటితో పాటు జనతా హై స్కూల్, నాయిగావ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో.. ట్రస్టీగా, చైర్ పర్సన్ పదవుల్లో ఉన్నారు.

వసంత్ రావ్ చవాన్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడిందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడెట్టియార్, ఇతర నాయకులు ఆయన నివాళులర్పించారు.

”కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాందేడ్ ఎంపీ వసంత్ రావ్ జీ చవాన్ మరణించారనే వార్త మమల్ని కలిచివేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ట ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీయే తన కుటుంబం అని నమ్మిన నాయకుడు. వసంత్ రావ్ మృతి వల్ల యావత్ కాంగ్రెస్ పార్టీ దు:ఖం లో ఉంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి పార్టీ తోడుగా ఉంది.” నానా పటోల్ ట్వీట్ చేశారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×