EPAPER

Madhya Pradesh Polls 2023 | మధ్యప్రదేశ్‌లో వార్ వైన్ సైడే.. బిజేపీకి భారీ మెజారిటీ!

Madhya Pradesh Polls 2023 | మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బిజేపీ భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు తెలుస్తోంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిజేపీ 128 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ 78 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. నవంబర్ 17న ఒకే విడతలో మొత్తం 230 సీట్ల ఎన్నికలు ఒకేసారి జరిగాయి.

Madhya Pradesh Polls 2023 | మధ్యప్రదేశ్‌లో వార్ వైన్ సైడే.. బిజేపీకి భారీ మెజారిటీ!

Madhya Pradesh Polls 2023 | మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బిజేపీ భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు తెలుస్తోంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిజేపీ 128 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ 78 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. నవంబర్ 17న ఒకే విడతలో మొత్తం 230 సీట్ల ఎన్నికలు ఒకేసారి జరిగాయి.


దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపు సాధింస్తుందని అంచనాలు వచ్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కాంగ్రెస్, బిజేపీ మధ్య గట్టిపోటీ ఉండబోతోందని తేలింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్యంలో బిజేపీ సష్టమైన మెజారిటీతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 52 జిల్లా ముఖ్యకార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది.

ఛింద్ వాడా నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. గ్వాలియర్ ప్రాంతంలో దిమ్ని నియోజకవర్గం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బిజేపీ తరపున 24429 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ I.N.D.I.A కూటమిలో తన ప్రభావం పెంచకోవచ్చని భావించింది. కానీ కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. దీనికి కారణాలను పరిశీలిస్తే..

బిజేపీ ఈ ఎన్నికల్లో వ్యహాత్మకంగా ముందుకెళ్లింది. బిజేపీలో బడా నాయకులు, కేంద్ర మంత్రులని ఎన్నికల బరిలో దింపింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే, బిజేపీ నేషనల్ జెనరల్ సెక్రటరి కైలాష్ విజయవర్గియ, బిజేపీ ఎంపీలు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రితి పాఠక్ మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి.. బిజేపీకి విజయం వైపుకి తీసుకెళ్లేందుకు కీలక పాత్ర పోషించారు.

మధ్యప్రదేశ్‌లో బిజేపీ ప్రభుత్వం లాడ్లీ బెహనా అనే సంక్షేమ పథకం ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తోడ్పడింది. దాదాపు మధ్యప్రదేశ్‌లోని 1.31 కోట్ల మహిళలకు ప్రతి నెల రూ.1250 ప్రభుత్వం అందిస్తోంది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ కోసం భారీ సంఖ్యలో మహిళల ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఎప్పుడూ తోడుండే దళిత ఓటర్లు కూడా బిజేపి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.

సీఎం పదవిలో 16 సంవత్సరాలపాటు ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గత అయిదు సంవత్సరాల్లో పార్టీ లోపల తన నాయకత్వానికి ఎదురే లేకుండా చేసుకున్నారు. పలుకుబడి ఉన్న సీనియర్లను కేంద్ర మంత్రులుగా.. పార్టీ జాతీయ కార్యకలాపాలు చూసుకునేందుకు వెళ్లిపోయారు. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా సజావుగా పాలన కొనసాగిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో హిందుత్వ రాజకీయాలు ఎక్కువ. దీంతో శివరాజ్ సింగ్ రాష్ట్రంలోని దేవలయాల ఆధునీకరణతో అభివృద్ధి చేసేందుకు క‌ృషి చేశారు. హిందుత్వ ప్రభావం ఎక్కువ ఉండడంతో కాంగ్రెస్ కూడా మధ్యప్రదేశ్‌లో సెక్యులర్ విధానాలను ఎన్నికల వేళ గట్టిగా వినిపించలేదు.

ఉత్తర్ ప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లో బుల్డోజర్ రాజకీయాలు నడిచాయి. హిందుత్వకు వ్యతిరేకంగా ఎవరన్న వ్యవహరిస్తే వారి ఇళ్లపై బుల్డోజర్ నడిపించి కూలదోశారు. కొంత కాలం క్రితం ఉజ్జైని నగరంలో శోభాయాత్ర సమయంలో కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రాళ్లు రువ్విన ఘటనలో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేసింది. ఆ తరువాత అదే నగరంలో ఒక పాపపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేసింది.

అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజేపీ అధిష్ఠానం మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రస్తావించలేదు. దీంతో ఆయన మళ్లీ మరో పావు కదిపారు. ఎన్నికల వేళ ప్రతి ప్రచార కార్యక్రమంలో మహిళా ఓటర్ల సపోర్ట్ తీసుకున్నారు. ప్రచార సమయంలో మహిళలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వారందిరినీ పలుమార్లు ప్రశ్నించారు. రాష్ట్రంలో మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వారంతా ఏకపక్షంగా శివరాజ్ సింగ్ పేరే ప్రస్తావించారు. ప్రస్తుతానికి బిజేపీ అగ్రనాయకులు చెప్పక పోయినా.. శివారజ్ సింగ్‌నే మరోసారి సిఎం పదవి అలంకరించనున్నారని తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అసలు కాంగ్రెస్‌‌ని ఎలా బలహీన పరిచారు అనేది ప్రశ్న. దీనికి ఓ పెద్ద కారణం. గ్వాలియర్ రాజ వంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా. అవును ఆయన ప్రాంతంతో దాదాపు 23 సీట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచినా.. ఆ తరువాత ప్రభుత్వం కూలిపోవడానికి జ్యోతిరాదిత్య సింధియానే కారణం. ఆయన కాంగ్రెస్ వదిలి బిజేపీలో చేరారు. పోతూ.. పోతూ.. 23 ఎమ్మెల్యేలను తనతో తీసుకెళ్లారు. అసలు 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌లో 23 సీట్లు అంటే 10 శాతం ఆయన వెంటే ఉన్నాయి. ఇది బిజేపీ సాధించిన అతి పెద్ద విజయం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 114 సీట్లలో 26 సీట్లు సింధియా రాజ్యమైన గ్వాలియర్ ప్రాంతంలోనివే.

జ్యోతిరాదిత్య సింధియా గునా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీని వీడి బిజేపీలో చేరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నుంచి 23 ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా చేసినందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనకు ఏవియేషన్ మినిస్టర్ పదవి కట్టపెట్టింది.

Tags

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×