EPAPER

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!

Lok Sabha Polls 2024 BJP CampaigningLok Sabha Polls 2024 BJP Campaigning: మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తోన్న ప్రధాని మోదీ విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇక రానున్న లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ హోలీ తర్వాత మార్చి 25న దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మోదీ ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


అటు దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాలికలను రూపొందించారు. అటు అస్సాంలో 1 లేదా 2 సభలుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో 15కు మించి సభలు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Read More: రాజ్యసభకు సుధా మూర్తి.. నారీ శక్తి అంటే ఇదేనంటూ ప్రధాని మోదీ ట్వీట్..


ఇక మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీ సహా దేశవ్యాప్తంగా సభల్లో పాల్గొననున్నారు. అటు మధ్యప్రదేశ్‌లో సీఎం మోహన్ యాదవ్ ప్రచారాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మతో పాటు ఎంపీ సీఎం ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×