EPAPER

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.


డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.

గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్ సమావేశమవ్వగా.. మహువాను లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫార్సును ప్యానెల్ కు ఆమోదించింది. దానిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. నివేదికలో పార్లమెంట్ మెంబర్ గా మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, హేయమైనవని, నేరపూరితమైనవని ఎథిక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.


తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×