EPAPER

Lok Sabha Elections 2024: బీహార్‌లో కుదిరిన ఒప్పందం.. బీజేపీ, జేడీయూ మధ్య ఎంపీ సీట్ల పంపకాలు ఇలా!

Lok Sabha Elections 2024: బీహార్‌లో కుదిరిన ఒప్పందం.. బీజేపీ, జేడీయూ మధ్య ఎంపీ సీట్ల పంపకాలు ఇలా!
NDA Seat Deal in Bihar
NDA Seat Deal in Bihar

NDA Seat Deal in Bihar(Political news telugu): బీహార్‌లో ఎన్డీయే అధికారికంగా తన సీట్ల-భాగస్వామ్య ఫార్ములాను సోమవారం సాయంత్రం ప్రకటించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లల్లో పోటీ చేయనుండగా, సీఎం నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(LJP) ఐదు స్థానాల్లో, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్‌ఎల్‌ఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.


ఎల్‌జేపీకి బలమైన కోట అయిన నవాడను బీజేపీ చేజిక్కించుకుంది. గయా, కరకత్ ఎంపీ సీట్లకు బదులుగా జేడీ(యు)కి షెయోహర్‌ను ఇచ్చింది. గత సారి కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన కిషన్‌గంజ్‌ను కూడా జేడీయూ దక్కించుకుంది.

షెయోహర్ సీటు కోసం నితీష్ కుమార్ తీవ్రంగా లాబీయింగ్ చేశారని, సోమవారం సాయంత్రం పార్టీలో చేరిన లవ్లీ ఆనంద్‌ను ఇక్కడ నుండి పోటీకి దింపవచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లవ్లీ ఆనంద్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ భార్య, అప్పటి RJD ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ తల్లి, విశ్వాస తీర్మానం సమయంలో నితీష్ కుమార్ JD(U) పక్షాన బహిరంగంగా నిలిచారు.


Also Read: జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి.. సంజయ్ సింగ్ ప్రమాణ స్వీకారంపై ఢిల్లీ కోర్టు ఆదేశం..

రెండవసారి మహా కూటమిని విచ్ఛిన్నం చేసి, ఈ సంవత్సరం ప్రారంభంలో బీజేపీతో నితీశ్ కుమార్ జేడీ(యు) చేతులు కలిపిన విషయం తెలిసిందే. బీహార్‌లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉండగా.. అన్ని(40) స్థానాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన సంజయ్ ఝా అన్నారు.

బీజేపీ పోటీ చేసే స్థానాలివే
పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, ఔరంగాబాద్, మధుబని, దర్భంగా, ముజఫర్‌పూర్, మహరాజ్‌గంజ్, సరన్, బెగుసరాయ్, నవాడా, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అరా, బక్సర్, ససారం

జేడీ(యు)పోటీ చేసే స్థానాలివే
వాల్మీకీ నగర్, సీతా మర్హి, ఝంఝర్‌పూర్, సుపాల్, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, మాధేపురా, గోపాల్‌గంజ్, సివాన్, భాగల్పూర్, బంకా, ముంగేర్, నలంద, జహనాబాద్, శివహర్

ఎల్‌జేపీ పోటీ చేస్ స్థానాలివే
వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగరియా, జాముయి

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×