EPAPER

Kolkata doctor rape-murder: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం..వెలుగులోకి సంచలన విషయాలు!

Kolkata doctor rape-murder: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం..వెలుగులోకి సంచలన విషయాలు!

Doctor says key points in Kolkata doctor rape-murder: కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటన మీద దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.


వైద్యురాలిపై ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఎక్కువమంది ఉన్నట్లు వెల్లడించారు. ఆమె శరీరంపై మొత్తం 14 గాయాలు ఉన్నట్లు తేలిందన్నారు. తల, మెడ, చేతులు, ప్రైవేట్ భాగాల్లో గాయాలయ్యాయన్నారు.

అదే విధంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావమైందన్నారు. శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డకట్టుకుపోయిందని చెప్పారు. గొంతు నులిమి ఊపిరి ఆడకుండా అత్యాచారం, హత్య చేశారని తేలింది. కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె తిన్న ఆహారంలో మత్తుమందు కలిపారా ? లేదా ? అన్నది ఫోరెన్సిక్ నివేదికలో తెలియాల్సి ఉంది.


Also Read:  ముడా స్కామ్.. గవర్నర్ ఆదేశాలు.. హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య

ఇదిలా ఉండగా, కోల్‌కతా వైద్యురిలి హత్యాచార ఘటన విషయంపై కొంతమంది సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహా ఆరోపించారు. ఈ మేరకు ఎవరైనా విమర్శలు చేస్తే అలాంటి వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి వారి వేళ్లు విరిచేస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు. లేకపోతే అలాంటి వ్యక్తులు బెంగాల్ ను బంగ్లాదేశ్ లా మార్చేస్తారని వ్యాఖ్యానించారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×