EPAPER

Cyclone Remal: రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. 21 గంటల పాటు ఆ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు..

Cyclone Remal: రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. 21 గంటల పాటు ఆ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు..

Kolkata airport to suspend flights due to Cyclone Remal: ‘రెమల్’ తుఫాను నేపథ్యంలో, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


“కోల్‌కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీరప్రాంతంపై రెమాల్ తుఫాను ప్రభావం దృష్ట్యా, వాటాదారులతో సమావేశం జరిగింది. కోల్‌కతాలో గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని భారీ అంచనాల కారణంగా మే 26న 12:00 IST నుంచి మే 27న 09:00 IST వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు.” అని NSCBI విమానాశ్రయ డైరెక్టర్ సి పట్టాభి ఒక ప్రకటనలో తెలిపారు.

అంతేకాకుండా, కోల్‌కతా పోర్ట్ కూడా ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు అన్ని కార్గో, కంటైనర్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పోర్ట్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు పోర్ట్ అధికారులు తెలిపారు.


Also Read: బంగాళాఖాతంలో తుపాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతంలో తొలిసారిగా మే 22న గమనించిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది, ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో ఉంది. పశ్చిమ బెంగాల్, కోస్టల్ బంగ్లాదేశ్, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తుఫాను మే 26 అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×