EPAPER

Shantanu Naidu: రతన్ టాటా భుజం మీద చేయి వేసిన శంతను నాయుడు.. ఈయన వయసు తెలిస్తే షాక్ అవుతారు

Shantanu Naidu: రతన్ టాటా భుజం మీద చేయి వేసిన శంతను నాయుడు.. ఈయన వయసు తెలిస్తే షాక్ అవుతారు

Know the Friendship Behind Ratan Tata And Shantanu Naidu :  రతన్ టాటా తన యంగ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలెసుకుని దిగిన ఫోటోలు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న అతనెవరు ? టాటాకు క్లోజ్ ఎలా అయ్యాడు ? చివరి రోజుల్లో ఎలాంటి సేవలు అందించాడు అనే విషయాలు నెటిజన్ల మనసులో మొదలయ్యాయి.


టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా తప్పుకున్నాక మానవత్వంతో నిండిన ఓ యువ జంతుప్రేమికుడు టాటాను అమితంగా ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే వృద్దాప్యంలో ఉన్న తనకు అతడ్ని సహాయకుడిగా నియమించుకున్నారు. అంతేకాదు అతడికి జనరల్ మేనేజర్ హోదాను సైతం కట్టబెట్టారు. దోస్తానాకు వయసుతో సంబంధం లేదని, మంచి మనసు సరిపోతుందని రతన్ టాటా, శంతను నాయుడు చెప్పకనే చెప్పారు. 2018లో జీఎంగా నియామకమైన శాంతను నిత్యం టాటా వెంటే ఉంటూ సపర్యలు చేసేవాడు.


Also read : రోజా ఏమయ్యారు? మీడియా ముందుకు రాలేక.. రికార్డెడ్ వీడియోలు, ఉనికి కోసం పాట్లు?

ఇక వృద్ధుల కోసం శంతను ‘గుడ్ ఫెలోస్’ పేరిట ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించి  సీనియర్ సిటిజన్లకు సహాయ సహకారాలు అందించేవారు. ఈ సంస్థ లక్ష్యం నచ్చిన రతన్ టాటా, ఇందులో పెట్టుబడులు సైతం పెట్టారు. 31 ఏళ్ల శంతను స్థాపించిన గుడ్ ఫెలోస్ స్టార్టప్ తక్కువ సమయంలోనే రూ.5 కోట్ల విలువను సాధించగలిగింది.

టాటా భుజాలపైనే చెయ్యేసేంత క్లోజ్ :

వయసు మీదపడిన ప్రపంచ వ్యాపార దిగ్గజం, ఓ యువకుడితో చేసిన స్నేహం ఎంతలా బలపడిందంటే, ఎనిమిది పదుల వయసు దాటిన బిజినెస్ టైకూన్ భుజంపై చెయ్యి వేసేంత. ఇక టాటాకు శంతను కేక్ తినిపిస్తున్న ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.

‘ప్రియమైన లైట్‌హౌస్’కి వీడ్కోలు :

రతన్ టాటా మరణంపై ఆయన యంగ్ ఫ్రెండ్, సహాయకుడు, జీఎం శంతను నాయుడు భారమైన హృదయంతో నివాళులర్పించారు.

నా ‘ప్రియమైన లైట్‌హౌస్’కి వీడ్కోలు, జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటానంటూ స్మరించుకున్నారు. ‘మీ నిష్క్రమణతో మన స్నేహబంధంలో ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి ప్రయత్నిస్తానన్నారు. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్’ అంటూ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శంతను నాయుడుది తెలుగే :

రతన్ టాటాకు అత్యంత దగ్గరగా కొనసాగిన శంతను నాయుడు మహారాష్ట్రలోని పూణెలో 1993లో పుట్టారు. అతడి తల్లిదండ్రులు తెలుగువారే కానీ మరాఠ గడ్డపై స్థిరపడ్డారు.

సావిత్రిబాయి ఫూలే పూణే వర్సిటీ నుంచి 2014లో మెకానికల్ ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్న తర్వాత 2016లో కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అనంతరం హెమ్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, జాన్సన్ లీడర్‌షిప్ కేస్ కాంపిటీషన్ వంటి అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆపై శంతను పూణెలోని టాటా ఎలిక్సిలో ఆటోమోటివ్ డిజైన్ ఇంజినీర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. రతన్ టాటా, శంతను ఇద్దరూ జంతు ప్రేమికులే కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. తనకు పెళ్లి కాకపోయినా శంతను తన కొడుకు లాంటోడని టాటా తరచుగా గుర్తు చేస్తుండేవారట.

Related News

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్.. రూ.2 వేల కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం పదవిపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌ సపోర్ట్‌ లేకుండానే!

Ratan Tata: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి.. అంతిమయాత్రలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ప్రముఖులు వీళ్లే

Jammu & Kashmir CM : ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా… సీఎంగా ముహుర్తం ఖరారు

Ratan Funeral last rites live updates: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర

Piyush Goyal: రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

Big Stories

×