EPAPER

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..
KEDARNATH GOLD

Kedarnath Temple: ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌ ఆలయంలో అవినీతి కలకలం రేపుతోంది. దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపడంలో 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు.


మహారాష్ట్రకు చెందిన ఓ దాత గర్భగుడిలో స్వర్ణ పలకల తాపడం చేయించారు. అయితే ఆలయ గర్భగుడిలో గోడలను బంగారు రేకులతో కప్పతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ కు ఉపాధ్యక్షుడిగానూ ఉన్న సంతోష్ త్రివేది ఈ కుంభకోణంలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరించారు.

బంగారు తాపడం చేయడం సంప్రదాయానికి విరుద్దమని.. ఆలయ నిర్వహణ కమిటీలోనే ఎంతోమంది దీన్ని వ్యతిరేకించారని అన్నారు. బంగారం నాణ్యతపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


అయితే ఈ ఆరోపణల్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలో ఈ ప్రచారం సాగుతోందని ఆరోపించింది. బంగారు తాపడం పనులను ఆర్కియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. పనులన్నీ దాత చేతుల మీదుగానే జరుగుతున్నాయని.. అందులో ఆలయ కమిటీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేసింది. గతంలో బద్రీనాథ్‌ ఆలయానికి బంగారు తాపడాన్ని చేయించిన దాతే ప్రస్తుతం దీన్ని తయారుచేయిస్తున్నారని తెలిపింది. కేదార్‌నాథ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×