EPAPER

Kavitha Bail Petition Hearing: కవిత బెయిల్ పిటిషన్.. నేడు విచారించనున్న కోర్టు..!

Kavitha Bail Petition Hearing: కవిత బెయిల్ పిటిషన్.. నేడు విచారించనున్న కోర్టు..!

Hearing on Kavitha Bail Petition Today in Delhi Liquor Scam Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కానున్నది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే, రేపటితో జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్నది.


కవితను ఈడీ పలుమార్లు విచారించి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మార్చి 15న అరెస్ట్ చేసింది. అదేవిధంగా కవిత జైలులో ఉండగానే సీబీఐ ఈనెల 11న అరెస్ట్ చేసింది. అయితే, తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read.. కలిసిరాని కాలం, ఈనెల 22న..


కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందంటూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే… ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనున్నది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×