EPAPER

5 Crore, 106 Kg Jewellery Seized: కర్ణాటకలో భారీగా డబ్బు.. ఆభరణాలు సీజ్.. ఎవరివి?

5 Crore, 106 Kg Jewellery Seized: కర్ణాటకలో భారీగా డబ్బు.. ఆభరణాలు సీజ్.. ఎవరివి?
Karnataka Police Seized Rs 5 CR Cash, 106 Kg of Jewellery in Pre Election 2024
Karnataka Police Seized Rs 5 CR Cash, 106 Kg of Jewellery in Pre Election 2024

5 Crore Cash, 106 Kg Jewellery Seized in Karnataka During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం భారీగా పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించినా డబ్బు పట్టుబడుతూనే ఉంది. తాజాగా కర్ణాటకలో దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.


బళ్లారిలో స్థానిక హేమ జ్యూవెలర్స్ అధినేత నరేష్ సోనీ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో నగదు, నగలు పట్టుబడ్డాయి. దాదాపు 106 కిలోల ఆభరణాలు ఉన్నాయి. అందులో మూడు కేజీల గోల్డ్, 103 కేజీల సిల్వర్ ఉంది. అలాగే 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ భారీగా నగదు, నగలు పట్టుబడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి మరింత నిఘా పెంచారు. బోర్డర్‌లో బలగాలను మొహరించారు. కర్ణాటకకు రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ ఏప్రిల్ 26న కాగా, మే నాలుగున రెండో దశ పోలింగ్ జరగనుంది.


Also Read: Hemangi Sakhi: దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!

మరోవైపు కర్ణాటకలో సోదాలు ముమ్మరమయ్యాయి. కోలార్‌ పరిధిలోని ఓ కారులో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. 1200 జిలెటిన్ స్టిక్స్, 7 బాక్సుల వైర్లు, 6 డిటోనేటర్లను ఓ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×