EPAPER

Prajwal Revanna Scandal: వివాదంలో కర్ణాటక మంత్రి.. ప్రజ్వల్… కృష్ణుడు మాదిరిగా!

Prajwal Revanna Scandal: వివాదంలో కర్ణాటక మంత్రి.. ప్రజ్వల్… కృష్ణుడు మాదిరిగా!

Karnataka Minister Ramappa Compares Prajwal Revanna with Lord Krishna:  కర్ణాటకలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ బహిష్కృత ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిందితుడు వ్యవహారాన్ని కాసేపు పక్కనబెడితే.. అధికార కాంగ్రెస్-విపక్ష బీజేపీ మధ్య మాటలు యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా కర్ణాటక ఎక్సైజ్‌శాఖ మంత్రి రామప్ప తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.


ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని విజయపురంలో జరిగిన సభలో మాట్లాడిన మంత్రి రామప్ప, ప్రజ్వల్ వ్యవహారానికి మించి దేశానికి తలవంపులు తెచ్చే ఘటన ఇప్పటివరకు మరొకటి లేదన్నారు. ఇది గిన్నిగ్ రికార్డు గెలుచుకోవచ్చన్నారు. తన భక్తితో పలు మహిళలతో శ్రీకృష్ణుడు కలిసి జీవించారని, కానీ ప్రజ్వల్ అలాకాదని చెప్పుకొచ్చారు. ఆ రికార్డును ప్రజ్వల్ బ్రేక్ చేద్దామనుకుంటున్నట్లుగానే తాను భావిస్తున్నానని మనసులోని మాట బయటపెట్టారు.

మంత్రి రామప్ప మాటలపై బీజేపీ రియాక్ట్ అయ్యింది. మంత్రి రామప్పను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీకి చెందిన మాజీమంత్రి సీటీ రవి డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ శ్రీకృష్ణుడిని అవమానించడమే నని, ఆయన్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చిరించారు. పరిస్థితి గమనించిన కర్ణాటక కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.


Also Read: బ్రిష్‌భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరణ.. బరిలోకి కుమారుడు

మంత్రి రామప్ప వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెబుతూనే, ఇది మా పార్టీ ఓపీనియన్ కాదని తేల్చేశారు కర్ణాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనతే. ప్రజ్వల్‌ను ఓ రాక్షసుడిగా వర్ణించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టిన కాంగ్రెస్, తాజాగా మంత్రి రామప్ప చేసిన వ్యాఖ్యలతో డిఫెన్స్‌లో పడిపోయింది. అయినా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ వదిలేసి, మంత్రి మాటలను కాంట్రవర్సీ చేయడం గమనార్హం. మరి ఎన్నికలు అయ్యేలోపు ప్రజ్వల్ వ్యవహారం ఇంకెన్ని మలుపుతిరుగుతుందో చూడాది.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×